హెల్త్ టిప్స్

White To Black Hair : ఇలా సులభంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చేయవచ్చు.. అది కూడా పదే నిమిషాల్లో..!

White To Black Hair : తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..? తెల్ల జుట్టు నుండి మీ జుట్టును నల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా సులభంగా, మీరు మీ తెల్ల జుట్టుని మార్చుకోవచ్చు. క్షణాల్లో జుట్టు నల్లగా అయిపోతుంది. వయసు పెరిగితే, ఆటోమేటిక్ గా న‌ల్ల జుట్టు తెల్లగా అయిపోవడం సాధారణమే. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలని అనుకునే వాళ్ళు, ఇలా చేయడం మంచిది. తెల్ల జుట్టు రాగానే చాలా మంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి విపరీతంగా వాడేస్తూ ఉంటారు.

ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య వస్తుంది. అలానే, వీటి వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి. అలా కాకుండా, మీరు మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలని అనుకుంటే, ఇలా చేయడం మంచిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే తెల్ల జుట్టుని సులభంగా ఇలా న‌ల్ల‌గా మార్చుకోవచ్చు.

your white hair will turn into black like this

ఒక బౌల్ తీసుకొని అందులో టీ పొడిని మెత్తగా చేసుకుని వేసుకోండి. అలానే, అందులో కొంచెం కాఫీ పొడిని కూడా వేసుకోండి. 50 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె, అరచెక్క నిమ్మరసం వేసుకొని దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక, వేడి నీళ్లని తీసుకొని డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ ని మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.

రెండు నెలల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. అప్పటివరకు వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె ని గోరువెచ్చగా మార్చుకుని తలకి పట్టించాలి. రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే, సరిపోతుంది. చుండ్రు వంటి బాధలు కూడా ఉండవు. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. వారానికి రెండు సార్లు మీరు ఈ విధంగా చేస్తే సరిపోతుంది.

Admin

Recent Posts