Zinc Foods For Hair Growth : అందమైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టు మనం అందంగా కనిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందమైన, ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే బాహ్య సంరక్షణ విధానాల కన్నా జుట్టుకు అంతర్గతంగా పోషణను ఇవ్వడం చాలా అవసరం. జుట్టు పెరుగుదలలో, జుట్టు అందంగా, ధృడంగా కనిపించడంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అందమైన, ఒత్తైన జుట్టు మన సొంతమవుతుంది. కనుక మనం రోజువారి ఆహారంలో భాగంగా జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏమిటి.. అలాగే జింక్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన జుట్టుకు కలిగే లాభాలేమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జింక్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల జింక్ తో పాటు జుట్టుకు అవసరమైన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు జుట్టు యొక్క జీవశక్తి కూడా మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ముదురు రంగు ఆకుకూరలను తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. ఆకుకూరలను తీసుకోవడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టు మన సొంతమవుతుంది. అలాగే కాయ ధాన్యాలను తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలన్నీ మన జుట్టుకు అందుతాయి. వీటిని సూప్స్, పప్పు, సలాడ్ వంటి వాటిలో చేర్చి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జింక్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పును తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ఇతర ముఖ్య పోషకాలు కూడా లభిస్తాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇక ప్రోబయోటిక్ తో పాటు పెరుగులో జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. అలాగే కోడిగుడ్డు కూడా జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. కోడిగుడ్డును తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. జుట్టుకు కావల్సిన సూక్ష్మ పోషకాలను అందించడంలో ఇవి మనకు సహాయపడతాయి. అదే విధంగా శనగలను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే జింక్ లభిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు ధృడంగా తయారవుతుంది. ఇక సముద్ర ఆహారమైన గుల్లలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ఇతర ముఖ్యపోషకాలు లభిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి మనకు సహాయపడతాయి. అలాగే లీన్ రెడ్ మీట్ లో ప్రోటీన్ తో పాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన జింక్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో అందమైన, ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టు మన సొంతమవుతుంది.