Carrot Peanut Fry : క్యారెట్లు, ప‌ల్లీలు వేసి ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Carrot Peanut Fry : క్యారెట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంటల్లో క్యారెట్ ను మనం విరివిగా వాడుతూ ఉంటాము. అలాగే క్యారెట్స్ తో వంట‌కాలు కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా క్యారెట్స్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో క్యారెట్ ప‌ల్లీల ఫ్రై కూడా ఒక‌టి. క్యారెట్స్, ప‌ల్లీల పొడి వేసి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ ఫ్రైను త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యారెట్ ప‌ల్లీల ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ప‌ల్లీల ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 200 ఎమ్ ఎల్, క్యారెట్ ముక్క‌లు – అర‌కిలో, ప‌ల్లీలు – పావు క‌ప్పు, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – పావు క‌ప్పు, ఎండు కొబ్బ‌రి పొడి – పావు క‌ప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Carrot Peanut Fry recipe in telugu make in this way
Carrot Peanut Fry

క్యారెట్ ప‌ల్లీల ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీళ్లు పోసి అందులో క్యారెట్ ముక్క‌లు వేసి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు కొద్దిగా వేగిన త‌రువాత ధ‌నియాలు, శ‌న‌గ‌ప‌ప్పు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత నువ్వులు, ఎండు కొబ్బ‌రి పొడి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, కారం, ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత ఉడికించిన క్యారెట్ ముక్క‌లు వ‌డ‌క‌ట్టి వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిని 7 నుండి 8 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడిని త‌గినంత వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ప‌ల్లీల ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ ఫ్రైను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts