Banana Tea : అర‌టి పండ్ల‌తోనూ టీ చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజూ తాగాలి..!

Banana Tea : రోజూ ఉదయం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అలాగే రోజు మొత్తంలో ఎప్పుడు వీలైతే అప్పుడు టీ, కాఫీల‌ను తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు కొంత వ‌ర‌కు మ‌న‌కు మేలు చేస్తాయి. కానీ వీటిని ఎక్కువ మోతాదులో మాత్రం తాగ‌రాదు. అయితే టీ లేదా కాఫీ తాగాల‌ని అనిపిస్తే వాటికి బ‌దులుగా అర‌టి పండ్ల‌తో చేసే బ‌నానా టీ ని తాగండి. అవును.. అర‌టి పండ్ల‌తో టీ ఏమిట‌ని మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. కానీ ఈ పండ్ల‌తోనూ మనం టీ త‌యారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. దీన్ని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే బ‌నానా టీ ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్ల‌ను పోసి మ‌రిగించాలి. ఇప్పుడు ఒక అర‌టి పండును తీసుకుని దాని పైన‌, చివ‌రి భాగాల‌ను క‌ట్ చేయాలి. అనంత‌రం ఆ పండును మ‌రుగుతున్న నీటిలో అలాగే వేయాలి. త‌రువాత స్ట‌వ్‌ను సిమ్‌లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మ‌ళ్లీ మ‌రిగించాలి. అనంత‌రం నీటిని వ‌డ‌క‌ట్టాలి. అందులో దాల్చిన చెక్క పొడిని అవ‌స‌రం అనుకుంటే తేనెను కూడా క‌లుపుకోవ‌చ్చు. దీంతో అర‌టి పండు టీ రెడీ అవుతుంది. దీన్ని గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే తాగేయాలి. ఈ టీ ఎంతో టేస్టీగా ఉంటుంది. రోజుకు ఒక క‌ప్పు తాగితే చాలు, ఎన్నో లాభాల‌ను పొంద‌వచ్చు. అయితే అర‌టి పండును తొక్క‌తో స‌హా లేదా తొక్క తీసి కేవ‌లం పండును వేసి కూడా మ‌రిగించుకోవ‌చ్చు. రుచిగా ఉండాలంటే కేవ‌లం పండును వేసి మ‌రిగించాలి. లేదా పోష‌కాలు ఇంకా ఎక్కువ కావాలంటే తొక్క‌తో స‌హా అర‌టి పండును నీటిలో వేసి మ‌రిగించాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అర‌టి పండు టీ త‌యార‌వుతుంది. ఈ టీని రోజూ తాగాలి. అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Banana Tea benefits in telugu this is the way to make it
Banana Tea

అర‌టి పండు టీని తాగ‌డం వ‌ల్ల చ‌క్కెరపై వ్యామోహం త‌గ్గుతుంది. దీంతో చ‌క్కెర త‌క్కువ‌గా తింటారు. దీని వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం అన్న‌ది త‌గ్గుతుంది. అలాగే భ‌విష్య‌త్తులో షుగ‌ర్ వచ్చే అవ‌కాశాలు కూడా త‌గ్గుతాయి. ఇక అర‌టి పండు టీలో ట్రిప్టోఫాన్‌, సెర‌టోనిన్‌, డోప‌మైన్ అనే మజిల్ రిలాక్సంట్స్ ఉంటాయి. ఇవి మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తాయి. దీంతో ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గ్గుతాయి. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే అర‌టి పండు టీని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గవచ్చు. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాలు అధికంగా ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఈ టీని తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణలోకి వ‌స్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. క‌నుక అర‌టి పండు టీని త‌ప్ప‌నిస‌రిగా రోజూ తాగాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Share
Editor

Recent Posts