Tomato Onion Chutney : ట‌మాటా, ఉల్లి చ‌ట్నీ త‌యారీ ఇలా.. ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ఎంతో బాగుంటుంది..

Tomato Onion Chutney : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం రోజూ వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే ఎన్ని తిన్నా స‌రే.. ఇడ్లీ, దోశ వంటివి తింటేనే మ‌న‌కు సంతృప్తి క‌లుగుతుంది. ఇడ్లీ, దోశ వంటి ఆహారాల‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే వీటిలోకి మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ చేస్తుంటాం. ఇవి రుచిగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం వెరైటీగా ట‌మాటా, ఉల్లి చ‌ట్నీ చేయండి. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య‌క‌రం కూడా. ఈ చ‌ట్నీని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే ట‌మాటా, ఉల్లి చ‌ట్నీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటా, ఉల్లి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ట‌మాటాలు – 3, ఉల్లిపాయ‌లు – 2, ప‌చ్చి మిర్చి – 6, మిన‌ప ప‌ప్పు – 1 టీస్పూన్‌, మెంతులు – కొద్దిగా, ధ‌నియాలు – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బ – 1, చింత పండు – చిన్న నిమ్మ‌కాయ ప‌రిమాణంలో, నూనె – త‌గినంత‌, ఉప్పు – స‌రిప‌డా.

Tomato Onion Chutney recipe in telugu very tasty how to make it
Tomato Onion Chutney

తాళింపు కోసం కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఆవాలు – 1 టీస్పూన్‌, మిన‌ప పప్పు – 1 టీస్పూన్‌, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – 1 రెబ్బ‌.

ట‌మాటా, ఉల్లి చ‌ట్నీని త‌యారు చేసే విధానం..

ముందుగా పాన్ పెట్టి వేడి చేసి అందులో మెంతులు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి ఒక‌దాని త‌రువాత ఒక‌టి వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చి మిర్చి వేయాలి. ఇవి వేగాక ఉల్లిపాయ ముక్క‌లు ఆపై కాసేపాగి ట‌మాటాలు కూడా వేసి వేయించాలి. త‌రువాత చ‌ల్లార్చుకుని చింత‌పండు, ఉప్పు వేసి మెత్త‌గా రుబ్బుకోవాలి. ఆపై ఆవాలు, మిన‌ప ప‌ప్పు, ఎండు మిర్చి, క‌రివేపాకుతో తాలింపు వేయాలి. ఇది పెస‌ర‌ట్టు, దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం వంటి టిఫిన్ల‌లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఊర‌గాయ‌ల క‌న్నా తాజాగా చేసుకునే ఈ ప‌చ్చ‌ళ్ల వ‌ల్ల పోష‌కాలు కూడా అందుతాయి. ట‌మాటాల్లోని కెరోటినాయిడ్లు కంటికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. అందువ‌ల్ల ఈ చ‌ట్నీని త‌ర‌చూ చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts