Cold Coffee : కోల్డ్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోండి..!

Cold Coffee : మ‌న‌లో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంద‌రు ప్ర‌తి రోజూ కాఫీని తాగాల్సిందే. కాఫీని తాగ‌డం వ‌ల్ల మాన‌సిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. దీనిని తాగిన వెట‌నే శ‌రీరంలో ఎన‌ర్జీ స్థాయిలు పెరుగుతాయి. మ‌న‌కు బ‌య‌ట హోట‌ల్స్ లో, రెస్టారెంట్ ల‌లో వివిధ రుచుల్లో కాఫీ దొరుకుతుంది. మ‌న‌కు బ‌య‌ట దొరికే వాటిల్లో కోల్డ్ కాఫీ కూడా ఒక‌టి. కోల్డ్ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. అయితే రుచిగా దీనిని చాలా సులువుగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కోల్డ్ కాఫీని ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కోల్డ్ కాఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాఫీ పౌడ‌ర్ – 3 టీ స్పూన్స్, నీళ్లు – 10 ఎంఎల్, పాలు – 200 ఎంఎల్ , పంచ‌దార పొడి – 4 లేదా 5 టీ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 4, చాక్లెట్ సిర‌ప్ – 2 టీ స్పూన్స్, వెనీలా ఐస్ క్రీమ్ – 4 టేబుల్ స్పూన్స్.

Cold Coffee here it is how you can make it at home
Cold Coffee

కోల్డ్ కాఫీ త‌యారీ విధానం..

ముందుగా పాల‌ను కాచి చ‌ల్లార్చి ఫ్రిజ్ లో పెట్టి చల్ల‌గా అయ్యేయ వ‌ర‌కు ఉంచాలి. ఒక గిన్నెలో కాఫీ పౌడ‌ర్ ను తీసుకుని అందులో నీటిని పోసి ఉండ‌లు లేకుండా క‌లిపి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఫ్రిజ్ లో పెట్టిన పాల‌ను, పంచ‌దార పొడిని, ఐస్ క్యూబ్స్ ను వేసి ఒక నిమిషం పాటు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వెనీలా ఐస్ క్రీమ్ ను, చ్లాకెట్ సిర‌ప్ ను వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ను లేదా క‌ప్పును చాక్లెట్ సిర‌ప్ తో గార్నిష్ చేసి అందులో మిక్సీ ప‌ట్టుకున్న కాఫీని పోయాలి. ఈ కాఫీ పై కొద్దిగా నురుగును వేసి దానిపై వెనీలా ఐస్ క్రీమ్, చాక్లెట్ పౌడ‌ర్, చాక్లెట్ సిర‌ప్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోల్డ్ కాఫీ త‌యార‌వుతుంది. బ‌య‌ట అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌డానికి బ‌దులుగా ఇలా కోల్డ్ కాఫీని ఎప్పుడు కావాలంటే అప్పుడు మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు.

Share
D

Recent Posts