Garuda Mukku Kayalu : మనం పండ్లను, కాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని రకాల కాయలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో గరుడ ముక్కు కాయలు కూడా ఒకటి. ఇవి గరుడ ముక్కు చెట్టు నుండి లభిస్తాయి. ఈ మొక్కను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తాయి. ఈ గరుడ ముక్కు కాయలు ఎంతో శక్తివంతమైనవి. ఈ కాయలు గరుత్మంతుని ముక్కులాగా, నాగ పడగలాగా ఉంటాయి. పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారాలకు కట్టేవారు. అలాగే ఇంట్లో పెట్టుకునే వారు. ఈ కాయలకు అతీంద్రియ శక్తులు ఉంటాయట. నర దిష్టి, నర పీడను, నర ఘోష వల్ల ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇంట్లో డబ్బు నిలవక పోవడం, భార్యా భర్తల మధ్య గొడవలు ఇలా అనేక సమస్యలు వస్తాయి. ఈ కాయలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంటికి, ఇంట్లోని వారికి నరదిష్టి, నర ఘోష వంటివి తగలకుండా ఉంటాయి.
ఒక అమావాస్య రోజున 5 లేదా 11 ఎండిన గరుడ ముక్కు కాయలను సేకరించి వాటిని ఇంటికి తీసుకు వచ్చి ధూపం చూపించి వాటిని దండ లాగా గుచ్చి మరలా ధూపం చూపించి ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి పోతుంది. అంతేకాకుండా ఈ కాయలను ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఆ ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల శత్రు భయాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం ప్రవాహంగా వస్తుందని పూర్వీకులు నమ్మేవారు. ఈ కాయలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో దరిదాపుల్లోకి కూడా భూత ప్రేత పిశాచులు అస్సలు రావట. ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. అంతేకాకుండా ఈ చెట్టు ఆకులు రాత్రి పూట ఆకాశాన్ని చూస్తూ తపస్సు చేస్తాయట. వీటిని రాత్రిపూట శబ్దం చేయకుండా, వాటి తపస్సుకు భంగం కలగకుండా చూడాలట. వీటి తపస్సుకు భంగం కలిగిస్తే ఈ చెట్లు శపిస్తాయని నమ్మేవారు.
గరుడ ముక్కు చెట్టును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. తేలు విషాన్ని హరించడంలో ఈ మొక్క పని చేసినట్టు ఏ ఇతర మొక్క కూడా పని చేయదని నిపుణులు చెబుతున్నారు. తేలు కుట్టినప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని తేలు కాటుకు గురి అయిన ప్రాంతంలో వేసి ఆ దంచిన ఆకులను ఆ ప్రాంతంలో ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే తేలు విషం హరించుకుపోతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకు రాయడం వల్ల క్షయ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. అంతేకాకుండా ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఛాతి నొప్పి తగ్గుతుంది.
ఈ ఆకుల రసాన్ని గాయలపై, పుండ్ల పై రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి. ఈ మొక్క వేరును ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ఈ కషాయం అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. ఈ విధంగా గరుడ ముక్కు చెట్టును ఉపయోగించి ఆరోగ్యంతోపాటు అదృష్టాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.