Cough And Cold : వారంలో రెండు సార్లు ఈ క‌షాయం తాగండి.. ద‌గ్గు, జ‌లుబు అస‌లు రానే రావు..!

Cough And Cold : సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌కు స‌హజంగానే ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. దీంతోపాటు కొంద‌రికి జ్వ‌రం కూడా ఉంటుంది. ఈ మూడు ఒకేసారి వ‌స్తే చాలా అవ‌స్థ‌గా అనిపిస్తుంది. ఏ ప‌ని చేయాల‌నిపించ‌దు. ముక్కు దిబ్బ‌డ కూడా బాధిస్తుంది. అయితే కొందరికి మాత్రం సీజ‌న్లతో సంబంధం లేకుండా త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. కానీ కింద తెలిపిన విధంగా క‌షాయాన్ని త‌యారు చేసుకుని వారంలో రెండు సార్లు తాగితే.. ఈ స‌మ‌స్య‌లు అస‌లు రావు. మ‌రి ఆ క‌షాయాన్ని ఎలా త‌యారు చేయాలంటే..

drink this Kadha weekly twice to be safe from Cough And Cold
Cough And Cold

10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క‌, 4 ల‌వంగాలు, చిన్న బెల్లం ముక్క‌, గుప్పెడు తుల‌సి ఆకులు, రెండు బిర్యానీ ఆకుల పొడి, కాస్త అల్లం త‌రుగు వేసి నీటిని బాగా మ‌రిగించాలి. దీన్ని ఒక క‌ప్పు మోతాదులో తాగాలి. ఇలా వారంలో రెండు సార్లు.. అంటే 3 రోజుల‌కు ఒక‌సారి దీన్ని తాగుతుండాలి. ఇలా తాగుతుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

పైన చెప్పిన విధంగా క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగితే ద‌గ్గు, జలుబు అసలు బాధించ‌వు. జ్వ‌రం కూడా త‌గ్గుతుంది. ముఖ్యంగా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, ఇత‌ర వ్యాధులు కూడా రావు. పైగా షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా మేలు జ‌రుగుతుంది.

Admin

Recent Posts