Breakfast : ఉద‌యాన్నే ఇవి తింటే ఇక మీకు తిరుగు ఉండ‌దు..!

Breakfast : మనం రోజూ స‌హ‌జంగానే మూడు పూట‌లా తింటాం. అయితే మూడు పూట‌ల్లోనూ ఉద‌యం తినే ఆహార‌మే చాలా ముఖ్య‌మైంది. ఎందుకంటే రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు శ‌రీరానికి ఎలాంటి ఆహారం ల‌భించ‌దు. క‌నుక ఉద‌యం నిద్ర‌లేవ‌గానే శ‌క్తి కోసం శ‌రీరం ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే ఉద‌యం పూట మ‌నం తినే ఆహారం నుంచే అధిక మొత్తంలో పోష‌కాల‌ను శరీరం శోషించుకుంటుంది. క‌నుక ఉద‌యం తినే ఆహారాన్ని చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది అయి ఉండాలి. అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. అయితే అలాంటి ఆహారం ఏది ? ఉద‌యం ఏయే ఆహారాల‌ను తింటే శ‌రీరానికి మేలు జ‌రుగుతుంది, అన్ని పోష‌కాలు అందుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

take these foods daily in breakfast for these amazing benefits
Breakfast

1. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో క‌చ్చితంగా ఒక గుడ్డు ఉండేలా చూసుకోవాలి. దీన్ని మ‌ధ్యాహ్నం, రాత్రి క‌న్నా ఉద‌యం తింటేనే ఎంతో మేలు. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలూ మ‌న‌కు ల‌భిస్తాయి. అలాగే శ‌క్తి అందుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. రోజంతా శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారికి గుడ్డు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక ఉడ‌క‌బెట్టిన గుడ్డును తింటే మేలు జ‌రుగుతుంది.

2. పెరుగుమీద తోడుకునే మీగ‌డ‌ను మ‌జ్జిగ‌లా త‌యారు చేస్తారు. దానిపై పేరుకునేదే వెన్న‌. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఉద‌యం తినే ఆహారంలో ఒక టీస్పూన్ వెన్న‌ను చేర్చుకోవాలి. దీంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కొవ్వు ప‌దార్థాలు అందుతాయి. ఇవి విట‌మిన్ డి ని త‌యారు చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతోపాటు రోగ నిరోధ‌క‌శ‌క్తి పెరిగేలా చేస్తాయి.

3. రాత్రి పూట 7-8 బాదంప‌ప్పుల‌ను నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వాటిని పొట్టు తీసి తినాలి. ఇవి శ‌రీరానికి అమిత‌మైన శ‌క్తిని అందిస్తాయి. అలాగే అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. వీటితో పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

4. ఓట్స్‌ను కూడా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో త‌ర‌చూ తీసుకోవాలి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో గుండె సుర‌క్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

5. ఉద‌యం వ్యాయామం చేసేవారు లేదా రోజంతా శారీర‌క శ్ర‌మ చేసేవారు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక అర‌టి పండును తినాలి. ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. అరటి పండు వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు.

6. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో స్ట్రాబెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. మ‌న శ‌రీరానికి రోజుకు కావ‌ల్సిన విటమిన్ సి ఉద‌య‌మే వీటి ద్వారా ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది.

7. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన త‌రువాత టీ, కాఫీల‌కు బ‌దులుగా ఒక క‌ప్పు గ్రీన్ టీని తాగాలి. ఇది మెట‌బాలిజంను పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు క‌రిగే ప్ర‌క్రియ ఉద‌యం నుంచే ప్రారంభం అవుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం రోజంతా క‌రుగుతూనే ఉంటుంది. ఇది అధిక బ‌రువును వేగంగా తగ్గించుకునేందుకు స‌హాయ ప‌డుతుంది.

క‌నుక పైన తెలిపిన ఆహారాల‌ను ఉద‌యాన్నే తీసుకుంటే అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది.

Admin

Recent Posts