Grapes Juice : మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం అనేక రకాల పండ్లను ఆహారం తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు విరివిరిగా అన్నీ కాలాల్లోనూ లభిస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మనకు గింజలు ఉండే ద్రాక్ష పండ్లు, గింజలు లేని ద్రాక్ష పండ్లు, హైబ్రిడ్ ద్రాక్ష పండ్లు ఇలా వివిధ రుచుల్లో ఈ ద్రాక్ష పండ్లు మనకు లభిస్తాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిలో ప్లోటేట్స్, రైబో ప్లేవిన్, థయామిన్, నియాసిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, సోడియం, పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
ఈ ద్రాక్ష పండ్లను నేరుగా తినడంతో పాటు వీటితో జ్యూస్ ను తయారు చేసుకుని తాగినా కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. రుచిగా ద్రాక్ష పండ్ల జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు ద్రాక్ష పండ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఒక గ్లాస్ నీటిని పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ లో మరో గ్లాస్ నీటిని పోసి కలపాలి. తరువాత తగినంత తేనెను వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ద్రాక్ష పండ్ల జ్యూస్ తయారవుతుంది. దీనిలో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు.
ఈ విధంగా తయారు చేసుకున్న ద్రాక్ష పండ్ల జ్యూస్ ను తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనం జబ్బుల బారిన పడకుండా ఉంటాము. ద్రాక్ష పండ్ల జ్యూస్ ను తాగడం వల్ల లేదా ద్రాక్ష పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరిచేరకుండా ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుంది. తద్వారా మనం బరువు కూడా తగ్గవచ్చు.
అలాగే ద్రాక్ష పండ్ల జ్యూస్ తాగడం వల్ల లేదా పండ్లను తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి. అలాగే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఈ పండ్లను తినడం వల్ల లేదా జ్యూస్ ను తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఈ విధంగా ద్రాక్ష పండ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల తక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.