మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి కారణంగా మనం ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే జీవితాంతం మందులను వాడాల్సి వస్తుంది. మందులను వాడినప్పటికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రాక బాధపడే వారు కూడా ఉన్నారు. కానీ డయాబెటిస్ ను ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా డయాబెటిస్ నుండి బయట పడవచ్చని వారు తెలియజేస్తున్నారు. డయాబెటిస్ ను తగ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. తద్వారా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ను నియంత్రించడంలో మామిడి ఆకులు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులు మనకు విరివిరిగా లభిస్తూనే ఉంటాయి. ఈ ఆకులు డయాబెటిస్ ను నియంత్రించే సహజ సిద్ద గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు మామిడి ఆకులతో టీ ని చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
మామిడి ఆకుల టీ ని తయారు చేసుకోవడానికి గాను ముందుగా మామిడి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక మామిడి ఆకులను వేసి 10 నిమిషాల పాటు మరలా వేడి చేయాలి. ఇలా తయారు చేసిన నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనినే మామిడి ఆకుల టీ అంటారు. ఇలా తయారు చేసుకున్న టీ ని ఒక రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల రక్తపోటు రాకుండా ఉంటుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. ఇతర హెర్బల్ ఆకుల వలే మామిడి ఆకులు కూడా జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఈ టీ ని రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ విధంగా మామిడి ఆకులతో టీ ని చేసుకుని తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.