Jaggery Tea : బెల్లం టీని తాగుతున్నారా.. లేదా.. బోలెడు లాభాలు పొంద‌వ‌చ్చు..

Jaggery Tea : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే టీ తాగే అల‌వాటు ఉంటుంది. అలాగే మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి, త‌ల‌నొప్పి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి, ప‌ని బ‌డ‌లిక‌ను తగ్గించుకోవ‌డానికి చాలా మంది టీ తాగుతూ ఉంటారు. కొంద‌రికి టీ తాగ‌నిదే రోజు గ‌డిచినట్టు ఉండ‌దు. అయితే ఈ టీ త‌యారీలో మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగిస్తాము. పంచ‌దార‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల టీ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. మ‌న‌కు మాన‌సిక ఆనందాన్ని ఇచ్చే ఈ టీని బెల్లంతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లం టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాలు విర‌గ‌కుండా రుచిగా ఈ బెల్లం టీ నిఎలా త‌యారు చేసుకోవాలి.. అలాగే ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం టీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బెల్లం తురుము – 4 టీ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన అల్లం ముక్క‌లు – కొద్దిగా , క‌చ్చా పచ్చాగా దంచిన యాల‌కులు – 4, పాలు – 2 గ్లాసులు, నీళ్లు – 2 గ్లాసులు, టీ పౌడ‌ర్ – 3 టీ స్పూన్స్.

Jaggery Tea drink daily for these benefits recipe
Jaggery Tea

బెల్లం టీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే టీ పౌడ‌ర్, బెల్లం తురుము, యాల‌కులు, అల్లం ముక్క‌లు వేసి బాగా మ‌రిగించాలి. డికాష‌న్ మ‌రిగిన త‌రువాత అందులో పాల‌ను పోసి మ‌రి కొద్ది సేపు మ‌రిగించాలి. త‌రువాత ఈ టీ ని వ‌డ‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం టీ త‌యార‌వుతుంది. టీ లో పంచ‌దార‌కు బ‌దులుగా బెల్లాన్ని వాడ‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. బెల్లం టీ ని తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

ఉద‌యం పూట ఈ టీని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నివారించ‌బ‌డుతుంది. ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు బెల్లం టీని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇందులో అల్లం, మిరియాలు వేసి తాగ‌డం వ‌ల్ల శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి జ‌లుబు, ద‌గ్గు వంటి బారిన ప‌డ‌కుండా ఉంటాంషుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా ఈ టీని నిర్భ‌యంగా తాగ‌వ‌చ్చు. ఈ విధంగా బెల్లంతో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts