Pomegranate Detox Juice : రోజూ ఉద‌యం ఈ జ్యూస్‌ను తాగండి.. శ‌రీరం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది.. ఎలాంటి రోగాలు రావు..

Pomegranate Detox Juice : నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. వాటిల్లో ఘ‌నాహారాలు, ద్ర‌వాహారాలు.. ఇలా అన్ని ర‌కాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క‌రు భిన్న‌మైన జీవ‌న‌శైలిని, ఆహార‌పు అల‌వాట్ల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలోనే వీట‌న్నింటి వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. సాధార‌ణంగా ఆరోగ్య‌వంతులు అయితే ఈ వ్య‌ర్థాలు అన్నీ వాటంత‌ట అవే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. కానీ ఏదైనా స‌మ‌స్య ఉంటే మాత్రం వ్య‌ర్థాలు స‌రిగ్గా బ‌య‌ట‌కు పోవు. ఎప్పుడైతే వ్య‌ర్థాలు పేరుకుపోతాయో అప్పుడు మ‌న శ‌రీరం రోగాల‌కు నిల‌యంగా మారుతుంది. కనుక శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోకుండా చూడాలి. అందుకు గాను కింద తెలిపిన ఓ జ్యూస్ స‌హాయ ప‌డుతుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌రీరాన్ని శుభ్రప‌రిచే డిటాక్స్ జ్యూస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 4 గ్లాసులు, దానిమ్మ పండు జ్యూస్ పావు క‌ప్పు, నిమ్మ‌ర‌సం – ఒక కాయ‌తో వ‌చ్చేంత‌, కీర‌దోస – 6 లేదా 7 ముక్క‌లు, దానిమ్మ పండు గింజ‌లు – పావు క‌ప్పు, పుదీనా ఆకులు – కొన్ని, తేనె – 1 టీస్పూన్‌.

Pomegranate Detox Juice recipe in telugu take daily
Pomegranate Detox Juice

డిటాక్స్ జ్యూస్‌ను త‌యారు చేసే విధానం..

ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నీళ్ల‌ను పోయాలి. అందులో కీర‌దోస ముక్క‌లు, దానిమ్మ పండ్ల జ్యూస్‌, పుదీనా ఆకులు, నిమ్మ‌ర‌సం, దానిమ్మ పండు గింజ‌లు, తేనె వేయాలి. ఒక‌సారి మిక్సీ ప‌ట్టుకోవాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా రోజంతా ఫ్రిజ్‌లో ఉంచిన మిశ్ర‌మాన్ని మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ ఈ డిటాక్స్ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం శుభ్రంగా మారుతుంది. అలాగే మ‌న‌కు పోష‌ణ‌, శ‌క్తి కూడా ల‌భిస్తాయి. దానిమ్మ పండ్ల గింజ‌లు, నిమ్మ‌ర‌సం, పుదీనా ఆకులు, తేనె ఇవ‌న్నీ స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు. క‌నుక ఇవి అనేక వ్యాధులను, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. గుండె జ‌బ్బులు రావు. కిడ్నీలు, లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఈ జ్యూస్‌తో అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Editor

Recent Posts