Black Cumin : రాత్రి వీటిని నీటిలో నాన‌బెట్టి.. మ‌రుస‌టి ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు రావు..

Black Cumin : షుగ‌ర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వంటి వివిధ ర‌కాల‌ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతుంది. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని ఒక ఔష‌ధంతో త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ ఔష‌ధాన్ని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే ఈ ఔష‌ధం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఈ ఔష‌ధ‌మే న‌ల్ల జీల‌క‌ర్ర‌. ఇది మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో లేదా ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా ల‌భిస్తుంది. ఆయుర్వేదంలో ఈ నల్ల జీల‌క‌ర్ర‌ను అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు.

మ‌న శ‌రీరంలో జుట్టు నుండి పాదాల వ‌ర‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించ‌డంలో ఈ న‌ల్ల‌జీల‌క‌ర్ర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌లో విట‌మిన్ బి1, బి2 ల‌తో పాటు క్యాల్షియం, ఐర‌న్, కాప‌ర్, జింక్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి. ఇవే కాకుండా యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాల‌ను కూడా ఈ న‌ల్ల‌జీల‌క‌ర్ర క‌లిగి ఉంటుంది. అయితే ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఏవిధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఈ నీటిని న‌ల్ల జీల‌క‌ర్ర‌ను న‌మిలి మింగాలి. న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు.

Black Cumin benefits in telugu soak in water take on empty stomach
Black Cumin

ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. ఈ విధంగా న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఈ న‌ల్ల జీల‌క‌ర్రను తీసుకోవ‌డం వ‌ల్ల న‌యం చేసుకోవ‌చ్చు. బీపీ నియంత్రిండంలో, మూత్ర‌పిండాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, గుండెను బ‌లంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో.. ఇలా అనేక విధాలుగా ఈ న‌ల్ల జీల‌క‌ర్ర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. న‌ల్ల‌జీల‌క‌ర్ర‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చురుకుగా జ‌రుగుతుంది. శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

అధిక బ‌రువు స‌మ‌స్య నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. న‌ల్ల జీల‌క‌ర్ర‌తో చేసిన ఈ నీటిని తీసుకోవ‌డం వల్ల కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ వ్యాధిన ప‌డ‌కుండా ఉంటాం. ఎముక‌లు ధృడంగా అవ్వ‌డంతో పాటు కీళ్ల నొప్పులు, న‌డుము నొప్పి కూడా త‌గ్గుతుంది. అదేవిధంగా పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ న‌ల్ల జీల‌క‌ర్ర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పిల్ల‌ల‌కు కూడా ఈ న‌ల్ల జీల‌క‌ర్ర నీటిని ఇవ్వ‌వ‌చ్చు. ఈ విధంగా న‌ల్ల జీల‌క‌ర్ర మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుందని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts