Shankhpushpi Tea : షుగర్‌, రక్త శుద్ధి, రోగ నిరోధక శక్తికి దివ్యమైన ఔషధం.. శంఖపుష్పి టీ.. తయారీ ఇలా..!

Shankhpushpi Tea : ప్రస్తుత తరుణంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వాటిల్లో హెర్బల్‌ టీ లు కూడా ఒకటి. చాలా మంది రోజూ భిన్న రకాల హెర్బల్‌ టీలను తాగుతున్నారు. అయితే వాటిల్లో చేర్చుకోదగిన వాటిలో శంఖపుష్పి టీ కూడా ఒకటి. ఈ టీని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీకి ఉపయోగించే పువ్వులు కూడా మన ఇంటి చుట్టు పక్కల లభిస్తాయి. మన పెరట్లోనూ ఈ మొక్కలు పెరుగుతాయి. ఈ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శంఖపుష్పి టీ తయారీకి కావల్సిన పదార్థాలు..

శంఖపుష్పి పువ్వులు (నీలం రంగువి) – 4 లేదా 5, నీళ్లు – కప్పున్నర, నిమ్మకాయ రసం – అర టీస్పూన్‌, తేనె – అర టీస్పూన్‌.

Shankhpushpi Tea wonderful remedy for many health problems recipe
Shankhpushpi Tea

శంఖపుష్పి టీని తయారు చేసే విధానం..

ముందుగా స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో శంఖపుష్పి పువ్వులను వేయాలి. దీంతో నీళ్లు నీలం రంగులోకి మారుతాయి. ఇలా 2 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టఫ్‌ ఆఫ్‌ చేసి నీళ్లను వడకట్టాలి. అందులో నిమ్మరసం, తేనె కలపాలి. దీంతో శంఖపుష్పి టీ తయారవుతుంది. దీన్ని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు ఒకసారి తాగితే చాలు.. చెప్పలేనన్ని లాభాలు కలుగుతాయి.

శంఖపుష్పి టీని రోజూ తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ టీతో రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. అలాగే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. షుగర్ లెవల్స్‌ తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్‌ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. గాయాలు, పుండ్లు అయిన వారు ఈ టీని రోజూ తాగుతుంటే అవి త్వరగా మానుతాయి. ఇలా శంఖపుష్పి టీతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Share
Editor

Recent Posts