Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే అతి పెద్ద అవయవం లివర్. ఇది అనేక ముఖ్యమైన పనులను చేస్తుంది. అనేక చర్యలను సక్రమంగా నిర్వహిస్తుంది. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం తినే ఆహారం నుంచి శక్తిని మనకు అందిస్తుంది. పోషకాలను శరీరానికి అందజేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇలా లివర్ మన శరీరంలో ఎన్నో పనులు చేస్తుంది. అందులో అందులో వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతుంటాయి. దీంతో లివర్ అనారోగ్యాల బారిన పడుతుంది. అప్పుడు మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగవు. దీంతో ప్రాణాంతక స్థితి ఏర్పడుతుంది. కనుక లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను లివర్‌లో పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపాలి. అలాగే లివర్ సమస్యలు ఉన్నవారు కూడా లివర్ ఆరోగ్యం కోసం పలు రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యంగా కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తయారు చేసి రోజూ తాగాలి. దీన్ని వరుసగా 3 రోజుల పాటు తాగాలి. దీంతో లివర్ మొత్తం కడిగేసినట్లు క్లీన్ అవుతుంది. అయితే సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు దీని వారం రోజుల పాటు తాగితే చాలు.. లివర్ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలంటే..
సగం కీర దోస ముక్క, ఒక చిన్న క్యారెట్, సగం బీట్‌రూట్ ముక్కలను తీసుకుని మళ్లీ చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టుకోవాలి. అనంతరం ఆ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. ఇలా తాగడం వల్ల లివర్ మొత్తం శుభ్రంగా మారుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తాగవచ్చు. ఇది సహజసిద్ధమైన లివర్ డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. దీంతో లివర్‌లోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.