Categories: ఆహారం

చ‌పాతీల‌ను ఈ విధంగా చేసుకుని తినండి.. ఎలాంటి వ్యాధులు రావు..!

ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెరిగింది. దీంతో అన్నంకు బ‌దులుగా గోధుమలు, జొన్న‌ల‌తో త‌యారు చేసిన చపాతీల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. అయితే అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డం స‌రైందే. కానీ వివిధ ర‌కాల ఇత‌ర ధాన్యాల‌న్నింటితోనూ చ‌పాతీల‌ను చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫ‌లితాలు ల‌భిస్తాయి.

make chapathis in this way and eat to keep diseases away

ప‌లు భిన్న‌ర‌కాల ధాన్యాల‌తో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లోని పోష‌కాల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ చ‌పాతీల‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

పొట్టు తీయని గోధుమ పిండి 2 కిలోలు, శ‌నగ పప్పు 100 గ్రాములు, మొక్కజొన్న లేదా జొన్నలు 100 గ్రాములు, సజ్జలు 50 గ్రాములు, బార్లీ 50 గ్రాములు, రాగులు 50 గ్రాములు, సోయాబీన్ 50 గ్రాములు, ఓట్స్ 100 గ్రాములు తీసుకోవాలి. అన్ని ధాన్యాల‌ను పొట్టు తీయ‌నివే తీసుకుంటే మంచిది.

గోధుమ‌లు త‌ప్ప అన్ని ధాన్యాల‌ను కొద్దిగా వేయించాలి. త‌రువాత చ‌ల్లారాక అన్నింటినీ గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కొద్దిగా ఆరనివ్వాలి. అనంత‌రం దాన్ని ఓ డ‌బ్బాలో నిల్వ చేసుకోవాలి.

ఇక పై విధంగా త‌యారు చేసుకున్న పిండిని కావ‌ల్సినంత తీసుకుని అందులో కొత్తిమీర, పుదీనా ఆకులు, నీళ్లు వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ముద్ద‌లుగా చేసి చ‌పాతీల‌ను త‌యారు చేయాలి. వాటిని పెనంపై కాల్చి వేడిగా ఉండ‌గానే తినేయాలి. అవ‌స‌రం అనుకుంటే కొద్దిగా నెయ్యి లేదా వెన్న‌ను వాడ‌వ‌చ్చు. దీంతో చ‌పాతీలు ఇంకా రుచిగా ఉంటాయి.

ఈ విధంగా చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని రాత్రి పూట తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. గుండె జ‌బ్బులు, షుగ‌ర్ త‌గ్గి శ‌రీర దారుఢ్యం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts