ఉద‌యం ఆహారంలో వీటిని తీసుకోవాలి.. ఇక మీకు తిరుగులేదు..!

సాధార‌ణంగా కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం మ‌నం తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వులు ఉద‌యాన్నే ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక భాగం ఉద‌యం ఆహారం నుంచే వ‌స్తాయి. ఈ క్ర‌మంలో శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు.

take these foods in breakfast for energy and nutrients

ఉద‌యం ఆహారంలో కింద తెలిపిన వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు అందుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌కుండా, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కోడిగుడ్డును త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఇందులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ దాదాపుగా ఉంటాయి. ప్రోటీన్లు, కొవ్వులు ల‌భిస్తాయి. అందువ‌ల్ల క‌చ్చితంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో తిన‌వ‌చ్చు. కూర‌గాయ‌ల‌తో క‌లిపి ఆమ్లెట్‌లా చేసుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ పోష‌కాలు ల‌భిస్తాయి.

2. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వెన్న లేదా నెయ్యిని తీసుకోవాలి. దీంతో మ‌న‌కు విట‌మిన్లు ఇ, కె లు ల‌భిస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు అందుతాయి. ఇవి శ‌క్తిని అందిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

3. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బాదంప‌ప్పును తీసుకుంటే మంచిది. రాత్రి పూట గుప్పెడు బాదంప‌ప్పును నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిని పొట్టు తీసి తినాలి. వీటి వ‌ల్ల పోష‌కాలు ఎక్కువ‌గా అందుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

4. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అందులో అర‌టి పండును క‌లిపి తింటే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

5. ఉద‌యం తీసుకోవాల్సిన ఆహారాల్లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. వీటి ద్వారా విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇక చివ‌రిగా గ్రీన్ టీని తాగాలి. దీంతో మెట‌బాలిజం పెరుగుతుంది. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

పైన తెలిపిన ఆహారాల‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts