Palli Undalu : మీ శ‌రీరం ఉక్కులా మారాలంటే.. దీన్ని రోజుకు ఒక‌టి తినండి..!

Palli Undalu : ప‌ల్లీల‌ను మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ప‌ల్లీల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వాటితో పల్లి ఉండలు, ప‌ల్లి ప‌ట్టి వంటి చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీ ఉండ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. సుల‌భంగా, రుచిగా, మ‌రీ గ‌ట్టిగా కాకుండా ఈ ప‌ల్లి ఉండ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి ఉండ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక క‌ప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టీ స్పూన్.

Palli Undalu if you want to make your body healthy and strong then take this daily one
Palli Undalu

ప‌ల్లి ఉండ‌ల త‌యారీ విధానం..

ముందుగా మందంగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో ప‌ల్లీల‌ను వేసి వేయించాలి. వీటిని చిన్న మంట‌పై దోర‌గా క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ఈ ప‌ల్లీల‌పై ఉండే పొట్టును తీయ‌డంతో పాటు ప‌ల్లీల‌ను ముక్క‌లుగా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్లు వేసి వేడి చేయాలి. బెల్లం క‌రిగి ముదురు పాకం వ‌చ్చే ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. బెల్లం ముదురుపాకం వ‌చ్చిందో లేదో తెలుసుకోవ‌డానికి ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో బెల్లం మిశ్ర‌మాన్ని వేసి ఉండ‌లా చుట్టాలి. బెల్లం మిశ్ర‌మం గ‌ట్టిగా ఉండ‌లా త‌యార‌యితే పాకం వ‌చ్చిన‌ట్టుగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక‌వేళ బెల్లం మిశ్ర‌మం మెత్త‌ని ఉండ‌లా అయితే మ‌రికొద్ది సేపు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంలో నెయ్యి ని వేసి క‌ల‌పాలి.

వెంట‌నే వేయించిన ప‌ల్లీల‌ను వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండ‌లుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లి ఉండ‌లు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 నుండి 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇదే మిశ్ర‌మంతో ఉండ‌ల‌కు బ‌దులుగా ప‌ల్లి ప‌ట్టీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని రోజుకు ఒక లేదా రెండు చొప్పున తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బ‌య‌ట కొనుగోలు చేసిన చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే ప‌ల్లి ఉండ‌లు చేసుకుని తినడం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts