High BP : 7 రోజుల పాటు రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తాగండి.. బీపీ మొత్తం అదుపులోకి వ‌చ్చేస్తుంది..

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ (అధిక ర‌క్త‌పోటు) స‌మస్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. చాలా మంది అధిక ఒత్తిడి కార‌ణంగానే బీపీ బారిన ప‌డుతున్నారు. బీపీ వ‌చ్చిందంటే జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. లేదంటే కంట్రోల్ కాదు. దీని వ‌ల్ల గుండె కూడా అనారోగ్యం బారిన ప‌డుతుంది. హార్ట్ ఎటాక్‌లు, ఇత‌ర గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌స్తుతం చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా బీపీ బారిన ప‌డుతున్నారు. అయితే బీపీ వ‌చ్చింద‌ని కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాను పాటిస్తే.. బీపీ చాలా వ‌ర‌కు కంట్రోల్ అవుతుంది. మ‌ళ్లీ పెర‌గ‌దు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌న ఇళ్ల‌లో, ఇంటి పెర‌ట్లో కాక‌ర చెట్టు ఉంటుంది. దానికి కాసిన కాక‌ర‌కాయ‌ను తాజాగా తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా క‌డ‌గాలి. అనంత‌రం ముక్క‌లుగా కోసి రోట్లో వేసి క‌చ్చా ప‌చ్చ‌గా దంచాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక శుభ్ర‌మైన వ‌స్త్రంలో తీసుకుని బాగా పిండాలి. దీంతో ర‌సం వ‌స్తుంది. ఆ ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో సేక‌రించాలి. ఒక కాయ స‌రిపోక‌పోతే ఇంకో కాయ‌ను వాడుకోవ‌చ్చు. ఇలా 30 ఎంఎల్ మోతాదులో తీసిన కాక‌ర‌కాయ ర‌సాన్ని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. దీన్ని తాగిన త‌రువాత గంట వ‌ర‌కు ఏమీ తిన‌రాదు.

take bitter gourd juice daily to control High BP
High BP

ఇలా రోజూ ప‌ర‌గ‌డుపున కాక‌ర‌ర‌సం తాగ‌డం వ‌ల్ల 7 రోజుల్లోనే బీపీ అదుపులోకి వ‌చ్చేస్తుంది. ఎంత‌టి బీపీ ఉన్నా స‌రే ఈ ర‌సాన్ని తాగుతుంటే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. అయితే బీపీ అదుపులోకి వ‌చ్చింద‌ని దీన్ని మానేయ‌రాదు. క‌నీసం నెల రోజుల పాటు తీసుకోవాలి. త‌రువాత కొద్ది రోజులు మానేయాలి. బీపీ పెరుగుతుంది అనుకుంటే మ‌ళ్లీ 7 నుంచి 20 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంటే త‌ప్ప‌క బీపీ అదుపులోకి వ‌స్తుంది. దీంతో కొన్నాళ్ల‌కు బీపీ మందుల‌ను వాడ‌డం మానేస్తారు. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఇలా చేయాల్సి ఉంటుంది.

కాక‌ర‌కాయ ర‌సం తాగితే కేవ‌లం బీపీ త‌గ్గ‌డం మాత్ర‌మే కాదు.. షుగ‌ర్ ఉన్న‌వారికి షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది. అది లేని వారికి షుగ‌ర్ రాదు. దీంతోపాటు లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ప‌లు విధాలుగా లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక కాక‌ర‌కాయ ర‌సాన్ని తాగ‌డం మ‌రిచిపోకండి.

Share
Editor

Recent Posts