Prabhas Anushka Shetty Marriage : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అని అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు.. ప్రభాస్. ఈయన ఎంతో కాలం నుంచి తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అప్పట్లో బాహుబలి సినిమా ఉందని.. కనుక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోలేనని.. చెప్పారు. దీంతో ఆ మూవీ అనంతరం ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఇక ఈ మధ్యే రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మరోసారి ఆయనకు పెళ్లి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. ప్రేమ, పెళ్లి తనకు సెట్ కావని.. వాటిని అంచనా వేయడంలో విఫలం చెందానని అన్నారు. అంటే ఆయనది లవ్ ఫెయిల్యూరా.. అని చాలా మంది సందేహాలను వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్, అనుష్కల పెళ్లి మ్యాటర్ మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలోనూ వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని వారు కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు కూడా ఈ వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్తలపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామల దేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె ప్రభాస్, అనుష్కల పెళ్లిపై వస్తున్న పుకార్లపై మాట్లాడారు.
ప్రభాస్‌కి మన సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ఉంది. మహిళంటే గౌరవం ఉంది. కుటుంబానికి.. ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తాడు. ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. అని తెలిపారు. ఓ నటితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకుంటాడనే వార్తలు వస్తున్నాయని అడగ్గా.. అందుకు ఆమె స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీలోని అమ్మాయా.. బయట అమ్మాయా ? అని అడిగితే.. ఏదీ ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అయితే తప్పకుండా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆమె స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్, అనుష్కల పెళ్లిపై వస్తున్న వార్తలు మరోసారి పుకార్లే అని రుజువయ్యాయి.