Black Salt : రోజూ మనం వంటల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పు లేనిదే ఏ వంటకమూ పూర్తి కాదు. ఉప్పుతో వంటలకు రుచి పెరుగుతుంది. అయితే మనం సాధారణంగా రోజూ వాడే ఉప్పు వేరు. మనకు ఆయుర్వేద పరంగా ప్రయోజనాలను ఇచ్చే ఉప్పులు వేర్వేరుగా ఉంటాయి. వాటిల్లో నల్ల ఉప్పు కూడా ఒకటి. దీన్నే బ్లాక్ సాల్ట్ అంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ దీన్ని తయారు చేస్తారు. మార్కెట్‌లో మనకు నల్ల ఉప్పు లభిస్తుంది. అయితే సాధారణ ఉప్పు కన్నా ఆయుర్వేద పరంగా మనకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల ఉప్పు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది.. దీన్ని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల ఉప్పు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గుతాయి. అలాగే మలబద్దకం అన్న సమస్యే ఉండదు. చిన్న పేగులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఉప్పును తినడం వల్ల గుండెల్లో మంట కూడా తగ్గుతుంది. అలాగే కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఈ ఉప్పును తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే దీంతో కాపడం కూడా పెట్టుకోవచ్చు. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతోపాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరిగిపోతుంది. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.