మూలిక‌లు

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు మొక్క‌లు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కానీ ఆయా మొక్క‌ల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే మ‌నకు క‌లిగే వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఒక్కో మొక్క ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. ఏయే మొక్క‌ల‌కు చెందిన ఆకుల‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మాచీ ప‌త్రంతో కంటి రోగాలు న‌యం అవుతాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. నేత్రాల‌కు ఈ ఆకులు చ‌క్క‌ని ఔష‌ధంలా ప‌నిచేస్తాయి. ఈ ఆకుల‌ను త‌డిపి క‌ళ్ల మీద ఉంచుకోవాలి. లేదా ప‌సుపు, నూనెతో నూరి శ‌రీరానికి రాసుకోవ‌చ్చు. నేల‌మున‌గ ఆకుల‌ను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గుతుంది. శరీరమునకు దివ్య ఔషధంగా ప‌నిచేస్తుంది. మారేడు ఆకుల‌తో మూల శంక నయమవుతుంది. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. జంటగరిక ఆకుతో మూత్ర సంబంధ వ్యాధులు తొల‌గిపోతాయి. పచ్చడి చేసుకొని తినవలెను.

different types of ayurveda leaves and their benefits

ఉమ్మెత్త ఆకుతో మానసిక రోగాలు తొలగును. ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి. అలాగే రేగు ఆకు శరీర సౌష్టవానికి శ్రేష్టం. మితంగా తింటే మంచిది. ఉత్తరేణి ఆకుల‌తో దంతవ్యాధులు నయమగును. ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి. తులసీ ఆకులు దగ్గు, వాంతుల‌ను త‌గ్గిస్తాయి. సర్వ రోగనివారిణిగా ప‌నిచేస్తాయి. రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది. మామిడి ఆకు కాళ్ళ పగుళ్ళు, అతిసారం వంటి వ్యాధుల న‌యం చేస్తాయి. మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి. ప‌గుళ్లు త‌గ్గుతాయి. గన్నేరు ఆకు జ్వరమును తగ్గించును. దీన్ని లోపలికి తీసుకోరాదు. అవిసె ఆకుల‌తో రక్త దోషాలు తొలగును. ఆకు కూరగా వాడవచ్చు.

అర్జున పత్రం లేదా మద్ది ఆకులు గాయాలు, పుండ్ల‌ను త‌గ్గిస్తాయి. వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి. దేవదారు ఆకులు శ్వాశకోశ వ్యాధుల‌ను తగ్గిస్తాయి. మరువం ఆకులు శరీర దుర్వాసన పోగొట్టును. వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను. వావిలి ఆకు ఒంటినొప్పులను తగ్గించును. నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది. గండకీ ఆకుతో వాత రోగములు నయమగును. జమ్మి ఆకుల‌తో కుష్ఠు వ్యాధులు తొలగును. ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి. జాజి ఆకులు నోటి దుర్వాసన పోగొట్టును. ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి. ​రావి ఆకుల‌తో శ్వాసకోశ వ్యాధులు తగ్గును. పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది. ​దానిమ్మ ఆకు అజీర్తి, ఉబ్బసం తగ్గిస్తుంది. పొడిచేసి కషాయంగా తాగవచ్చు. ​ జిల్లేడు ఆకులు వర్చస్సును పెంచుతాయి. ఇలా భిన్న ర‌కాల ఆకులు భిన్న వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయి.

Admin

Recent Posts