మూలిక‌లు

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

క‌ర‌క్కాయ‌ శాస్త్రీయ నామము terminalia chebula. సంస్కృతంలో హరితాకి అంటారు . కరక్కాయ వాత తత్వముపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది . బలం కలిగిస్తుంది, ఆయు కాలం పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది. కరక్కాయ విరేచానకారి, లుబ్రికేంట్. మలబద్దకాన్ని నివారిస్తుంది. పైల్స్ కి మంచి మందు. ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేటిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాతులు తగ్గిస్తుంది. జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఆదుర్దా , నాడీమండల నిస్త్రాణను నియంత్రిన్స్తుంది. కంటికి మంచి మందు. కంఠ‌ స్వరమును చక్కబెడుతుంది. కఫ‌ జ్వరాలు నయమవుతాయి.

కరక్కాయ పొడిని మోతాదుకు 3 గ్రాము లు తీసుకొని తేనెతో నిత్యం రెండు పూటలా తీసుకుంటూ, పథ్యము చేస్తు వుంటే 10 రోజుల్లో పచ్చకామెర్లు ( jaundice) తగ్గిపోతాయి. కరక్కాయ పొడి 1 భాగములో వేయించిన పిప్పళ్ళ పొడిని అర భాగము కలిపి దాంట్లో నుండి ఒక మోతాదుకు 1 గ్రా పొడిని తీసుకొని తేనెతో కలిపి ప్రతి 4 గంటలకి ఒకసారి తీసుకుంటే కోరింత దగ్గు( whooping cough) తగ్గిపోతుంది. భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ పొడిని కొంచెం బెల్లముతో కలిపి తీసుకుంటే రక్త మొలలు (piles) తగ్గిపోతాయి. కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరములు తగ్గుతాయి. కరక్కాయ పొడిని ఆముదములో కలిపి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

many wonderful home remedies using karakkaya

కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడు పూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది. ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి. ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయని లేక కరక్కాయ పొడిని వేసి ఉడికించి తీసుకోవాలి. ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడా లవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి.

రక్తహీనతతో బాధపడేవారు కరక్కాయ‌లను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది. కఫదోషంవల్ల శరీరంలో వాపు తయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3 గ్రాముల మోతాదుగా అర కప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి.

కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు, పిప్పళ్ల‌ చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండు పూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది. కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది. కరక్కాయ పిందెల చూర్ణాన్ని 3గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది.

Admin

Recent Posts