Shilajit : అన్ని ర‌కాల రోగాల‌ను త‌గ్గించే దివ్యౌష‌ధం ఇది.. అంద‌రూ రోజూ తినాలి..!

Shilajit : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల మందుల‌ను వాడుతున్నారు. విట‌మిన్ ట్యాబ్లెట్స్ ను, వివిధ ర‌కాల సిర‌ప్ ల‌ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేన‌ప్ప‌టికి వీట‌న్నింటిని వాడడానికి బ‌దులుగా మ‌నం ఒకే ఒక ప‌దార్థాన్ని వాడి మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఈ ఒక్క ప‌దార్థాన్నీ వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఆ ఒక్క ప‌దార్థం మ‌రేమిటో కాదు శిలాజిత్. దీనిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో వివిధ అవ‌యావాల‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించుకోవ‌చ్చు. దీని తీసుకున్న మొద‌టిసారే మ‌న శ‌రీరంలో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇది ఒక మ‌ల్టీప‌ర్ప‌స్ ట్యాబ్లెట్ లాగా ప‌ని చేస్తుంది. ఇందులో 85 కు పైగా పోష‌కాలు ఉంటాయి. దీనిని ఎవ‌రైనా ఉప‌యోగించ‌వ‌చ్చు. శిలాజిత్ తో పుల్విక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో చాలా సుల‌భంగా ప్ర‌యాణించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. శిలాజిత్ ను ప‌ర్వ‌తాల జిగురుగా పిలుస్తూ ఉంటారు. ప‌ర్వ‌తాల నుండి వ‌చ్చే జిగురునే శిలాజిత్ అంటారు. ఇది ఎక్కువ‌గా హియాల‌య ప‌ర్వ‌తాల్లో దొరుకుతుంది. ప‌ర్వ‌తాల్లో ల‌భించిన శిలాజిత్ ను శుద్ది చేసి మార్కెట్ లో బిల్ల‌లుగా లేదా లిక్విడ్ రూపంలో అమ్ముతూ ఉంటారు. శిలాజిత్ ఒక గులిక మ‌న శ‌రీరంలో ఉండే ఏడు ధాతువుల‌పై చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. మ‌నం ఎక్కువ‌గా లిక్విడ్ రూపంలో ఉండే శిలాజిత్ ను మాత్ర‌మే ఉప‌యోగించాలి.

Shilajit benefits how to use it for various diseases
Shilajit

శిలాజిత్ ను పెద్ద వారు 150 నుండి 200 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో లేదా పాల‌ల్లో 150 నుండి 200 మిల్లీ గ్రాముల మోతాదులో శిలాజిత్ ను క‌లిపి తీసుకోవాలి. దీనిని ఉద‌యాన్నే అల్పాహారం తీసుకోవ‌డానికి అర‌గంట ముందు తీసుకోవాలి. 18 సంవ‌త్స‌రాలు అలాగే ఆ వ‌య‌సు లోపు పిల్ల‌ల‌కు ఇందులో స‌గం మోతాదులో ఇవ్వాలి. శిలాజిత్ ను నీటితో వేసి మ‌రిగించి తీసుకోకూడ‌దు. కేవ‌లం గోరు వెచ్చ‌ని నీటిలో వేసి క‌లిపి మాత్ర‌మే తీసుకోవాలి. అలాగే ఆల్కాహాల్ తీసుకునే వారు దీనిని ఆల్క‌హాల్ తీసుకోవ‌డానికి 3 గంట‌ల ముందే తీసుకోవాలి లేదా ఆల్కాహాల్ తీసుకున్న మూడు గంట‌ల త‌రువాత తీసుకోవాలి. అదే విధంగా గ‌ర్భిణీ స్త్రీలు, 12 సంవ‌త్సరాల లోపు పిల్ల‌లు, శ‌రీరంలో ఐర‌న్ శాతం ఎక్కువ‌గా ఉన్న వారు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు, హైబీపీ పేషెంట్లు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ శిలాజిత్ ను తీసుకోకూడ‌దు.

అలాగే హార్మోన్ల‌కు సంబంధించిన మందులు వాడే వారు ఆ మందులు వేసుకున్న 3 గంట‌ల వ‌ర‌కు కూడా ఈ శిలాజిత్ ను వాడ‌కూడ‌దు. అలాగే ఈ శిలాజిత్ ను చ‌లికాలంలో ఎక్కువ‌గా వాడాలి. ఇది వేడి చేసే గుణాన్ని ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. క‌నుక‌ ఎండాకాలంలో దీనిని వారానికి మూడు సార్లు మాత్ర‌మే తీసుకోవాలి. దీనిని మూడు నెల‌ల కంటే ఎక్కువ‌గా తీసుకోకూడదు. మూడు నెల‌ల పాటు తీసుకున్న త‌రువాత ఒక నెల విరామం ఇచ్చి మ‌ర‌లా తీసుకోవాలి. శిలాజిత్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి. పురుషులు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. శిలాజిత్ ను తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా శిలాజిత్ మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts