Dosa Pindi Punugulu : మనం తరచూ దోశలను తయారు చేసుకుని తింటాం. దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. దోశలను చేసే ఈ దోశపిండితో మనం దోశలనే కాకుండా ఎంతో రుచిగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. దోశపిండితో చేసే పునుగులు చాలా రుచిగా ఉంటాయి. దోశపిండి ఉంటే చాలు వీటిని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దోశపిండితో ఎంతో రుచిగా ఉండే పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోశపిండి పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశపిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
దోశపిండి పునుగుల తయారీ విధానం..
ముందుగా దోశపిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. పిండి పలుచగా ఉంటే కొద్దిగా మైదాపిండి వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల్లా వేసుకోవాలి. వీటిని అటూ ఇటూ కదుపుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోశపిండి పునుగులు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా దోశపిండితో తరచూ దోశలే కాకుండా ఇలా పునుగులు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పునుగులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.