తిప్పతీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని అనేక రకాల మెడిసిన్ల తయారీలో ఉపయోగిస్తారు. తిప్పతీగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. తిప్పతీగ లివర్ వ్యాధులను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ పైరెటిక్ గుణాలు ఉంటాయి కనుక జ్వరాన్ని తగ్గిస్తుంది. అలాగే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా వ్యాధుల చికిత్సలోనూ తిప్పతీగను ఉపయోగిస్తారు.
తిప్పతీగ కీళ్ల నొప్పులను తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది. అందుకు గాను దీన్ని పాలతో తీసుకోవాలి. తిప్పతీగ ఆకు ఒక దాన్ని పాలలో వేసి మరిగించి ఆ పాలను తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
తిప్పతీగ మొక్క కాండాన్ని నమిలి తినవచ్చు. దీంతో ఆస్తమా తగ్గుతుంది. లేదా తిప్పతీగ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో రోజుకు ఒకసారి తాగాలి. దీంతో కూడా ఆస్తమాను తగ్గించుకోవచ్చు.
తిప్పతీగ ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. దాన్ని నీటిలో వేసి మరిగించాలి. చల్లారాక కాటన్ ప్యాడ్ తీసుకుని అందులో ముంచి కను రెప్పలపై రాయాలి. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు పోతాయి.
తిప్పతీగ ఆకు ఒకటి, కొద్దిగా ఉసిరిక పొడి, అల్లంలను కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా పట్టుకోవాలి. అందులో కొద్దిగా నీరు పోసి మళ్లీ బ్లెండ్ చేసుకోవాలి. అనంతరం వచ్చే రసాన్ని తాగుతుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
తిప్పతీగ మొక్క కాండాన్ని కొద్దిగా తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించాక వచ్చే మిశ్రమాన్ని తాగాలి. దీన్ని రోజుకు ఒకసారి తాగాలి. రక్తం శుద్ధి అవుతుంది. విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి.
తిప్పతీగ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో పరగడుపునే తాగుతుండడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.