Aloe Vera For Hair Growth : వారానికి రెండు సార్లు చాలు.. నెల‌లోనే జుట్టు ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..!

Aloe Vera For Hair Growth : జుట్టు అందంగా, పొడ‌వుగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ప్రతి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే ఉన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక ఎంతో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

అలాంటి వారు ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 3 టీ స్పూన్ల క‌ల‌బంద గుజ్జును, 2 టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను, ఒక విట‌మిన్ ఇ క్యాప్సుల్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో కల‌బంద గుజ్జు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొబ్బ‌రి నూనె, విట‌మిన్ ఇ క్యాప్సుల్ వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్లకు బాగా ప‌ట్టించాలి.

Aloe Vera For Hair Growth know how to use this remedy
Aloe Vera For Hair Growth

త‌రువాత జుట్టుకు ప‌ట్టించాలి. దీనిని రెండు నుండి మూడు గంట‌ల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. అయితే ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుద‌ళ్ల‌కు ప‌ట్టించేట‌ప్పుడు జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి. నూనె ఉండడం వ‌ల్ల జుట్టు కుదుళ్ల‌కు ఈ మిశ్ర‌మం చ‌క్క‌గా ప‌ట్ట‌దు. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు నెల రోజుల‌పాటు వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టుకు ఎదుగుద‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. జుట్టు మృదువుగా, అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

D

Recent Posts