Fatty Liver : మనిషి శరీరం ఎన్నో అవయవాల కలయిక. అదే మన అంతర్గత శరీర వ్యవస్థను ఒక సంక్లిష్టమైన నిర్మాణంగా మలుస్తుంది. ఇక శరీర భాగాల్లో కాలేయం అనేది ఎంతో కీలకమైంది. ఇది మన శరీరంలో చాలా రకాల జీవక్రియలు సక్రమంగా జరగడంలో తోడ్పడుతుంది. కానీ కాలేయానికి మాత్రమే వివిధ రకాల అనారోగ్యాలు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కాలేయ జబ్బుల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ముఖ్యమైనది. సాధారణంగా మన శరీరంలో కొవ్వు కణాలు ఎక్కువ అయినప్పుడు అవి చర్మం కింద పేరుకుపోయి, అది ఒబెసిటీ కి దారి తీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కొవ్వు కణాలు కాలేయం చుట్టూ పేరుకు పోతాయి. అప్పుడు అది ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుంది.
ఇక ఈ ఫ్యాటీ లివర్ లు రెండు రకాలుగా ఏర్పడుతాయి. వాటిలో ఒకటి మద్యపానం వల్ల కలిగేది కాగా, రెండోది శరీరంలో కొవ్వు కణాలు ఎక్కువ అవడం వలన ఏర్పడుతుంది. ఆయుర్వేదంలో ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినడం మానేయాలి. ముఖ్యంగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. వేపుళ్లు మన శరీరంలో వేడిని పెంచి జీవ ప్రక్రియలను దెబ్బ తీస్తాయి. ఆమ్లగుణం లేని, శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పుచ్చకాయలు, బెర్రీ పండ్లు, పియర్స్ లాంటివి మన శరీరాన్ని చల్లబరుస్తాయి. కనుక వాటిని తీసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలను తగిన మోతాదులో తీసుకోవాలి. వీటితో పాటు తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలను తీసుకోవాలి. పండ్ల రసాలు సేవించాలి. పుచ్చకాయ జ్యూస్ లేదా కలబంద జ్యూస్ మొదలైనవి మన దేహాన్ని చల్ల బరుస్తాయి. 2 గ్రాముల పిప్పళ్ల పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి ఒక నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుముఖం పడుతుంది. లివర్‌లో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే 10 నుండి 20 మి.లీ. నేల ఉసిరి జ్యూస్ ని కూడా రోజూ వారీగా తాగవచ్చు. దీంతోనూ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.