Tea Coffee : చాలా మంది ఉదయం నిద్రలేవగానే బెడ్ కాఫీ లేదా టీ లను తాగుతుంటారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే అలా తాగనిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఉదయం కాలకృత్యాలను సరిగ్గా తీర్చుకునేందుకు కూడా కొందరు కాఫీ, టీ లను తాగుతుంటారు. లేదంటే వారికి విరేచనం అవదు. అయితే ఇలా పరగడుపునే కాఫీ, టీలను తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఉదయం కాఫీ, టీ లను తాగడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పరగడుపునే కాఫీ, టీలను తాగడం వల్ల దీర్ఘకాలంలో ఆకలి నశిస్తుంది. అసలు ఆకలి అవదు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే ఆకలి నియంత్రణ ఉండదు కనుక ఆహారాన్ని కూడా అధిక మొత్తంలో తీసుకుంటారు. దీంతో బరువు పెరుగుతారు. ఫలితంగా గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక పరగడుపునే టీ, కాఫీలను తాగరాదు.
ఉదయం టీ, కాఫీలను తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీ, కాఫీల వల్ల శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరుతుంది. అలాగే శరీరంలో యాసిడ్ – ఆల్కలైన్ స్థాయిలు అదుపు తప్పుతాయి. దీంతో వికారం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇవి షుగర్ సమస్యను ఎక్కువ చేస్తాయి. కనుక ఉదయం టీ, కాఫీలను తాగడం మానేయాలి.
పరగడుపునే టీ, కాఫీలను తాగితే గ్యాస్ సమస్యలు వస్తాయి. జీర్ణాశయంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీంతో గుండెల్లో మంట, గ్యాస్ అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆహారం సరిగ్గా తినలేరు. అలాగే కాఫీ, టీను పరగడుపునే తాగడం వల్ల మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. దీంతో జీవక్రియలు సరిగ్గా జరగవు. శక్తి సరిగ్గా ఖర్చు అవదు. దీంతో కొవ్వు పేరుకుపోతుంది. అది అధిక బరువుకు దారి తీస్తుంది. దీని వల్ల షుగర్, హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక పరగడుపునే టీ, కాఫీలను తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.