Hair Growth : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు తెగడం, చిట్లడం తగ్గుతుంది. తెల్లబడిన జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే ఈ చిట్కా ఏమిటి… దీనిని ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అందులో మొదటిది కలబంద. కలబంద జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
జుట్టుకు కావల్సిన పోషకాలను అందించి జుట్టును బలంగా, ధృడంగా, మెరిసేలా చేయడంలో కలబంద ఎంతో దోహదపడుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన రెండో పదార్థం కొబ్బరి నూనె. జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనెను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనెను వాడడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు కావల్సిన పోషకాలు అంది జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు పదార్థాలను కలిపి జుట్టుకు రాసుకోవాలి. దీని కోసం కలబంద ముక్కను తీసుకుని అంచులను తొలగించి లోపల ఉండే గుజ్జును తీసుకోవాలి. ఈ గుజ్జును జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ కలబంద గుజ్జును 3 లేదా 4 టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తాజా కలబంద గుజ్జు లభించని వారు మార్కెట్ లో లభించే కలబంద జెల్ ను అయిన ఉపయోగించవచ్చు.
తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. తిరిగి ఉపయోగించాలి అనుకున్నప్పుడు కొద్ది సేపు ఎండలో ఉంచి ఆ తరువాత ఉపయోగించాలి. ఇలా కలబంద, కొబ్బరి నూనె కలిపి తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు బాగా పట్టించాలి. తరువాత ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లలోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. దీనిని ఇలాగే 2 గంటల పాటు ఉంచిన తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయడం వల్ల మన జుట్టు పెరుగుదలలో వచ్చిన మార్పును మనం చాలా సులభంగా గమనించవచ్చు. జుట్టు సమస్యల్నింటిని దూరం చేసుకోవచ్చు.