Autoimmune Disease Home Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా ఆటో ఇమ్యునో జబ్బులతో బాధపడుతున్నారు. ఆటో ఇమ్యునో రోగాల కారణంగా మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. క్యాన్సర్, కొన్ని రకాల కీళ్ల నొప్పులను, మొండి రోగాలను ఆటో ఇమ్యునో జబ్బులు అంటారు. పూర్వకాలంతో పోల్చినప్పుడు ఈ జబ్బులతో బాధపడే వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. చిన్న వయసు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఆటో ఇమ్యునో జబ్బుల బారిన పడితే అనేక రకాల మందులను వాడాల్సి వస్తుంది. స్టెరాయిడ్స్ ను వాడాల్సి వస్తుంది. శరీరం గుల్లగా తయారవుతుంది. ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతోషంగా జీవించలేరు. కొందరు ఈ జబ్బుల కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతారు.
ఆటో ఇమ్యునో జబ్బులు అంటే కూడా మనలో చాలా మందికి తెలియదు. దీంతో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. కనుక ఈ జబ్బుల గురించి అందరూ అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. సాధారణంగా మన శరీరంలో తెల్ల రక్తకణాలు శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలను నశింపజేసి శరీరాన్ని రక్షిస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మనల్ని రకక్షించే ఈ తెల్ల రక్తకణాలు మన శరీరంలో ఉండే అవయవాలను శరీరంలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలుగా భావించి అవయవాలపై దాడి చేస్తూ ఉంటాయి. దీంతో ఆ అవయవాలు దెబ్బతిని మన ఆటో ఇమ్యునో జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. ఈ తెల్లరక్తకణాలు మూత్రపిండాలు, చర్మం, కీళ్లు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు ఇలా ఏ అవయవం పైననైనా దాడి చేయవచ్చు. ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మారిన మన జీవన విధానమే. చాలా మంది జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు.
వ్యాయామం చేయడం లేదు. అస్థవ్యస్థమైన జీవన విధానాన్ని గడుపుతున్నారు. దీంతో చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఒక్కసారి సమస్యల బారిన పడితే జీవితాంతం బాధపడాల్సిందేనని భావిస్తారు. కానీ మన జీవన విధానాన్ని మార్చుకుంటే ఈ సమస్యల బారి నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనీసం 6 నెలల నుండి సంవత్సరం పాటు చక్కటి జీవన విధానాన్ని గడపాలని అప్పుడే జీవితాంతం బాధిస్తాయనుకున్న ఈ అనారోగ్య సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఆటో ఇమ్యునో జబ్బుల బారిన పడకుండా ఉండడంతో పాటు రుమాటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ వంటి ఆటో ఇమ్యునో జబ్బులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.