గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే&period; కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి&period; క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి&period; నేడు ఎక్కడ చూసినా&period;&period; ఏ ప్రాంతంలోనైనా సరే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది&period; దీంతో నిత్యం ఆ కాలుష్యంలో తిరగక తప్పడం లేదు&period; అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు&period; శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది&period; అందుకు ఏం చేయాలంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1783 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;ayurvedic-tips-to-be-safe-from-air-pollution-1024x690&period;jpg" alt&equals;"ayurvedic tips to be safe from air pollution " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; వేపాకులు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేపాకులను కొన్నింటిని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి&period; స్నానం చేసేటప్పుడు ముందుగా చర్మాన్ని&comma; వెంట్రుకలను ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి&period; దీంతో చర్మం&comma; వెంట్రుకలు శుభ్రంగా మారుతాయి&period; చర్మం&comma; వెంట్రులకు పట్టుకుని ఉండే కాలుష్య కారకాలు తొలగిపోతాయి&period; అలాగే నిత్యం 3 లేదా 4 వేపాకులను ఉదయాన్నే పరగడుపునే తింటే శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది&period; అలాగే రక్తం శుద్ధి అవుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; తులసి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలుష్యాన్ని శోషించుకోవడంలో తులసి మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి&period; నిత్యం 10 నుంచి 15 ఎంఎల్‌ మోతాదులో తులసి ఆకుల రసాన్ని తీసుకోవాలి&period; దీంతో శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; పసుపు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర టీస్పూన్‌ పసుపు&comma; ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె లేదా నెయ్యిలను కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపునే తినాలి&period; ఇలా చేసినా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; నెయ్యి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉదయం&comma; రాత్రి పడుకునే ముందు ముక్కు రంధ్రాల్లో 2 చుక్కల చొప్పున ఆవు నెయ్యి వేయాలి&period; దీంతో నాసికా రంధ్రాలు శుభ్రమవుతాయి&period; కాలుష్యకారకాలు ఉండవు&period; అలాగే నిత్యం రెండు లేదా మూడు టీస్పూన్ల నెయ్యిని తినాలి&period; ఇలా చేయడం వల్ల ఎముకలు&comma; కిడ్నీలు&comma; లివర్‌లలో పేరుకుపోయే సీసం&comma; పాదరసం వంటి లోహాలు బయటకు వెళ్లిపోతాయి&period; ఆయా భాగాలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు సంభవించకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; పిప్పళ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊపిరితిత్తులను శుభ్ర పరచడంలో పిప్పళ్లు అమోఘంగా పనిచేస్తాయి&period; శ్వాస సరిగ్గా ఆడేలా చేస్తాయి&period; ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period; అందుకు గాను పావు టీస్పూన్‌ అల్లం రసం&comma; పావు టీస్పూన్‌ పసుపు&comma; 1&sol;8 à°µ వంతు పిప్పళ్ల చూర్ణం&comma; ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలను ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి వరుసగా 7 రోజుల పాటు నిత్యం తీసుకోవాలి&period; దీంతో ముందు తెలిపిన సమస్యల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; త్రిఫల<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిఫల చూర్ణం కాలుష్యం బారి నుంచి మనల్ని రక్షిస్తుంది&period; శరీరంలోని మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది&period; రోగ నిరోధక శక్తిని పెంచుతుంది&period; నిత్యం రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్‌ స్పూన్‌ త్రిఫల చూర్ణం&comma; ఒక టీస్పూన్‌ తేనెలను బాగా కలిపి తీసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; దానిమ్మ పండు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగితే రక్తం శుద్ధి అవుతుంది&period; గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది&period; అలాగే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది&period; కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు కలగకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఆవిరి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని ఆవిరి వస్తుండగానే అందులో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ లేదా పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ను వేయాలి&period; తరువాత ఆ నీటి నుంచి వచ్చే ఆవిని 5 నిమిషాల పాటు పీల్చాలి&period; ఇలా రోజూ ఉదయం&comma; సాయంత్రం చేయాలి&period; దీంతో శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది&period; శ్వా్స సరిగ్గా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">9&period; ధూపం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుగ్గుళ్లు&comma; అగురు లతో తయారు చేసిన ధూపం పొగను ఇంట్లో వేయాలి&period; దీంతో ఇండ్లలో ఏర్పడే కాలుష్య కారకాలు నాశనమవుతాయి&period; ఇంట్లో అతిగా ఉండే తేమ పోతుంది&period; సాధారణంగా చాలా మందికి ఇండ్లలో ఉండే కాలుష్య కారకాల వల్లే తరచూ జలుబు&comma; దగ్గు వస్తుంటాయి&period; వాటిని నివారించేందుకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">10&period; మూలికలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు&comma; పచ్చి మిర్చి&comma; వాము&comma; అల్లం రసంలను నిత్యం తీసుకుంటే శ్వాస కోశ సమస్యలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">11&period; ప్రాణాయామం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాలి కాలుష్యం వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను తొలగించుకోవాలంటే నిత్యం ప్రాణాయామం&comma; కపాలభాతి&comma; జలనేతి వంటి పద్ధతులను సాధన చేయాలి&period; వీటి వల్ల శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; అందులో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి&period; శ్వాస సమస్యలు ఉండవు&period;<a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts