చిట్కాలు

3 రోజుల్లో పైల్స్ స‌మ‌స్య‌ను త‌గ్గించే చిట్కాలు.. బాబా రామ్ దేవ్ చెప్పిన‌వి..!

పైల్స్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగా చాలా మందికి వ‌స్తూనే ఉంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. థైరాయిడ్ స‌మ‌స్య ఉండ‌డం, షుగ‌ర్‌, అధిక బ‌రువు, మాంసాహారం ఎక్కువ‌గా తిన‌డం, కొన్ని గంట‌ల‌పాటు లేవ‌కుండా అలాగే కూర్చోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల పైల్స్ స‌మ‌స్య అనేది వ‌స్తుంటుంది. అయితే ఇందుకు చికిత్స అవ‌స‌రం లేద‌ని, రెండు చిట్కాల‌ను పాటిస్తే కేవ‌లం 3 రోజుల్లోనే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని ప్ర‌ముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. పైల్స్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు గాను బాబా రామ్ దేవ్ చెప్పిన ఆ చిట్కాల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాగా మ‌రిగించి చ‌ల్లార్చిన ఆవు పాల‌ను తీసుకుని అందులో కాస్త నిమ్మ‌ర‌సం పిండి తాగేయాలి. ఇలా రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. త‌రువాత 30 నిమిషాల‌పాటు ఏమీ తీసుకోకూడ‌దు. ఇలా 3 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. త‌ప్ప‌నిస‌రిగా పాల‌ను వేడి చేసి చ‌ల్లార్చాలి. అలాగే కేవలం ఆవు పాల‌నే ఈ చిట్కాకు వాడాలి. గేదె పాల‌ను వాడ‌కూద‌దు. ఇక పాల‌లో నిమ్మ‌ర‌సం పిండిన వెంట‌నే తాగేయాలి. స‌మ‌యం తీసుకోరాదు. ఈ చిట్కాను మూడు రోజుల పాటు పాటిస్తే పైల్స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని బాబా రామ్ దేవ్ చెప్పారు.

baba ramdev told these 2 remedies for piles

బాగా పండిన అర‌టి పండును పావుభాగం తీసుకుని అందులో ఒక గ్రాము మేర ప‌చ్చ క‌ర్పూరం (తినే క‌ర్పూరం) పెట్టి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాలి. ఇలా మూడు రోజుల పాటు చేయాలి. ఇలా ఈ రెండు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎలాంటి పైల్స్ అయినా స‌రే త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని బాబా రామ్ దేవ్ త‌న ఇన్‌స్టా వీడియోలో చెప్పారు.

Admin

Recent Posts