ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ముగింపుకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం మొదలు కాబోతోంది. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో ఎన్ని సెలవులు ఉన్నాయి అని చాలా మంది చూస్తుంటారు. దీంతో వారు తమ పని, విహారం తదితర అంశాలకు ముందుగానే సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఇక వచ్చే 2025 సంవత్సరానికి గాను మొత్తం ఎన్ని సెలవులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 2025 సంవత్సరంలో మొత్తం 17 గెజిటెడ్ సెలవులు ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కచ్చితంగా మూసి ఉంటాయన్నమాట. అలాగే మరో 34 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. ఇక పూర్తి సెలవుల జాబితా ఇలా ఉంది.
జనవరి 26న రిపబ్లిక్ డే ఉంది. ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి వస్తుంది. మార్చి 14న హోలీ పండుగ సెలవు ఉంటుంది. మార్చి 31వ తేదీన ఈద్-ఉల్-ఫితర్ పండును జరుపుకుంటారు. ఏప్రిల్ 10వ తేదీన మహావీర్ జయంతి కాగా ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తారు. మే 12వ తేదీన బుద్ధ పౌర్ణమి, జూన్ 7వ తేదీన బక్రీద్ ఉంటుంది. జూలై 6వ తేదీన మొహర్రం పండుగను జరుపుకుంటారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం ఉంటుంది.
ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీన మిలాద్-ఉన్-నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతిని నిర్వహిస్తారు. అదే రోజు దసరాను జరుపుకోనున్నారు. అక్టోబర్ 20వ తేదీన దీపావళి ఉంటుంది. నవంబర్ 5వ తేదీన గురునానక్ జయంతి, డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ ఉంటుంది. ఇక మొదటి గెజిటెడ్ హాలిడే జనవరి 26వ తేదీన ఉండగా, చివరి గెజిటెడ్ హాలిడే డిసెంబర్ 25న ఉంది. అలాగే దసరా సమయంలో 3 రోజుల పాటు సుదీర్ఘ సెలవులు ఉంటాయి. అక్టోబర్ నెలలో ఎక్కువ సెలవులు రానున్నాయి. ఆదివారాల్లో 3 సెలవులు వచ్చాయి. రిపబ్లిక్ డే, మొహర్రం, జన్మాష్టమిలను ఆదివారాల్లో జరుపుకుంటారు.