Barreka Chettu : ఈ ఆకుల‌తో దంతాల‌ను తోమితే చాలు.. దంతాలు తెల్ల‌గా మారిపోతాయి..!

Barreka Chettu : మ‌న‌లో చాలా మంది దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు ప‌సుపు ప‌చ్చ‌గా మార‌డం, గార ప‌ట్ట‌డం, పుచ్చి పోవ‌డం, నోటి నుండి దుర్వాస‌న రావ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌డే వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. అంద‌మైన ముఖ వ‌ర్చ‌స్సు క‌లిగిన వారు కూడా దంతాల కార‌ణంగా ఆక‌ర్ష‌ణీయంగా క‌న‌బ‌డ‌లేక‌పోతున్నారు. దంతాల వ‌రుస బాగుండ‌క పోయినా కూడా దంతాలు శుభ్రంగా ఉంటే చూడ‌డానికి అందంగా ఉంటుంది. దంతాలు అందంగా లేక‌పోవ‌డం వ‌ల్ల ముఖం అందాన్ని కోల్పోతుంది. ప‌సుపు ప‌చ్చ దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటాం. వీటితో ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆయుర్వేదం ద్వారా కూడా మ‌నం ప‌సుపు ప‌చ్చ దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

కాఫీ, టీ లను అధికంగా తాగే వారి దంతాలు ఎక్కువ‌గా గార ప‌డుతూ ఉంటాయి. వీటిలో ఉండే కెఫీన్ దంతాల‌పై అధికంగా ప్ర‌భావాన్ని చూపిస్తుంది. దంతాల‌ను గార ప‌ట్టేలా చేస్తుంది. అలాగే కొంద‌రు పొగాకు సంబంధిత ఉత్ప‌త్తుల‌ను కూడా తింటూ ఉంటారు. దీని వ‌ల్ల కూడా దంతాలు గార‌ప‌ట్ట‌డం, ప‌చ్చ‌గా మార‌డం జ‌రుగుతుంటుంది. దంతాల‌ గార‌ను, పుచ్చిపోవ‌డాన్ని ఎలా త‌గ్గించుకోవాలో, దీని కోసం ఆయుర్వేదంలో ఎటువంటి ప‌రిష్కారాలు ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Barreka Chettu can help get rid of teeth and gum problems
Barreka Chettu

గ్రామాల‌లో అధికంగా ఉండే బ‌ర్రెక చెట్ల‌ను ఉప‌యోగించి మ‌నం మ‌న దంతాల‌ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. దంతాలు ఆరోగ్యంగా, బ‌లంగా, అందంగా ఉండ‌డానికి మ‌నం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం బ‌ర్రెక చెట్టును ఉప‌యోగించి మ‌నం మ‌న దంతాల‌ను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. వీటి వ‌ల్ల‌ అనేక ఉప‌యోగాలు ఉన్న‌ప్ప‌టికీ దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప్ర‌తిరోజూ బ‌ర్రెక చెట్టు ఆకుల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌డ‌మే కాకుండా ఆరోగ్యంగా, బ‌లంగా కూడా ఉంటాయి.

ఈ చెట్టు పుల్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గుతుంది. భ‌విష్య‌త్తులో కూడా పిప్పి ప‌న్ను స‌మ‌స్య రాకుండా ఉంటుంది. బ‌ర్రెక చెట్టు పుల్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల ప‌సుపు ప‌చ్చ దంతాలు తెల్ల‌గా మారుతాయి. దంతాల‌ గారె కూడా తొల‌గిపోతుంది. మ‌నం సంపూర్ణంగా న‌వ్వ‌గ‌లిగిన‌ప్పుడే మ‌న ముఖానికి అందం వ‌స్తుంది. ఇలా న‌వ్వాలి అంటే మన దంతాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. బ‌ర్రెక చెట్టు ఆకుల‌ను, పుల్ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న దంతాల‌ స‌మ‌స్య‌లు అన్నీ పోయి మ‌నం సంపూర్ణంగా న‌వ్వ‌గలం. ఈ చెట్టు మ‌న‌కు అన్ని సార్లూ అందుబాటులో ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఈ చెట్టు ఆకుల‌ను, బెర‌డును స‌మ‌పాళ్ల‌ల్లోసేక‌రించి ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి రాళ్ల ఉప్పు పొడిని కూడా క‌లిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడితో ప్ర‌తిరోజూ దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారుతాయి. అంతేకాకుండా దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.

D

Recent Posts