Sanna Jaji Plant : మనం అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. మన ఇంట్లో పెంచుకోవడానికి సులభంగా ఉండే పూల మొక్కలలో సన్నజాజి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికీ తెలుసు. సన్నజాజి పూలు చక్కని సువాసనను కలిగి ఉంటాయి. ఈ పూలతో స్త్రీలు జడను అలకరించుకుంటారని మాత్రమే మనకు తెలుసు. మనలో చాలా మందికి సన్నజాజి మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుందని తెలియదు. సన్నజాజి మొక్క ఆకులు, వేర్లు, పువ్వులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీనిని సంస్కృతంలో మాలతి, రాజ పుత్రిక, జాజి సుమన అని హిందీలో చమేలా, జాయి అని పిలుస్తూ ఉంటారు.
జాజి పువ్వులు చేదు, వగరు రుచితో వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. తలనొప్పిని, కంటి నొప్పిని, దంత శూలను తగ్గించడంలో సన్న జాజి ఎంతగానో ఉపయోగపడుతుంది. సన్నజాజి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూలను మాలగా కట్టి తలలో ధరించడం వెనుక అంతులేని ఆరోగ్యం ఉంటుంది. ఈ పూలను తలలో ధరించడం వల్ల వాటి వాసన, స్పర్శ వల్ల శిరో రోగాలు హరించుకుపోతాయి. ఈ పువ్వులను మెత్తగా నూరి మర్మంగానికి రాత్రిపూట రాసి ఉదయాన్నే కడిగి వేయడం వల్ల పురుషులల్లో మర్మాంగం బలంగా తయారవుతుంది.
మూత్రం మంటగా, వేడిగా వస్తున్నప్పుడు 10 గ్రాముల సన్నజాజి మొక్క వేర్లను తెచ్చి దంచి వాటిని ఒక కప్పు కాచి చల్లార్చిన మేక పాలతో కలిపి వడకట్టి ఆ పాలను రోజుకు రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల మూత్రంలో మంట, వేడి తగ్గుతాయి. సన్నజాజి ఆకులను మెత్తగా నూరి రసాన్ని తీసి ఆ రసాన్ని చెవులలో 3 నుండి 4 చుక్కల మోతాదులో వేసుకోవడం వల్ల చెవిలో పుండ్లు తగ్గుతాయి. సన్నజాజి మొక్క ఆకులను, వేర్లను సమపాళ్లల్లో తీసుకుని నాటు ఆవు మూత్రంతో కలిపి మెత్తగా నూరి తలకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా, పొడుగ్గా పెరుగుతుంది. ఈ విధంగా సన్నజాజి మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.