Acne : ప్రస్తుత కాలంలో చాలా మంది యువతి యువకులు, నడి వయస్కు వారు ఎదుర్కొంటున్న చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు ఒకటి. ఇవే కాకుండా వీటి వల్ల ఏర్పడే గుంతలు, మచ్చలు మనల్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మొటిమల వల్ల ఎటువంటి సమస్య తలెత్తనెప్పటికి వీటి వల్ల ముఖం చూడడానికి అంద విహీనంగా కనబడుతుంది. ముఖం పై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం వంటి వాటిని మనం మొటిమల సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య బారిన పడిన వెంటనే చాలా మంది ఫేస్ వాష్ లను, క్రీములపు, సబ్బులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల మొటిమలు తగ్గినప్పటికి అవి తిరిగి మరలా వస్తూనే ఉంటాయి.
సహజ సిద్దంగానే మనం ఈ మొటిమలను తొలగించుకోవచ్చు. ముఖం పై మొటిమలు రాగానే చాలా మంది వాటిని గిల్లుతూ ఉంటారు. మొటిమలను ఇలా గిల్లడం వల్ల గుంతుల పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొటిమలు వాటంతట అవి పోయే వరకు వాటిని గిల్లకూడదు. అలాగే రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగాలి. నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఫ్రూట్ జ్యూస్ లను, కూరగాయ జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినాలి. జంక్ ఫుడ్ కు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఈ మొటిమతో బాధపడే వారు ముఖానికి మడ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నల్లటి మట్టిని సేకరించి పొడిగా చేసుకోవాలి. తరువాత దీనిని జల్లించి మెత్తని మట్టిని తీసుకోవాలి. తరువాత దీనికి నీటిని కలిపి రెండు నుండి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. నల్ల మట్టి నానడం వల్ల చాలా చల్లగా అవుతుంది. మట్టి చల్లగా అయిన తరువాత దీనిని తీసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిన తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల మొటిమల వల్ల ఏర్పడే గుంతలు, మచ్చలు కూడా తగ్గుతాయి. జిడ్డు చర్మం కూడా తాజాగా తయారవుతుంది. ఇలా అప్పుడప్పుడూ ఈ మడ్ ప్యాక్ ను వేసుకుంటూ ఉండడం వల్ల మొటిమల రావడం తగ్గు ముఖం పడతాయి. అలాగే చక్కటి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను వాడడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే మొటిమలు రాకుండా ఉంటాయి.