గ‌డ్డం, మీసాలు పెర‌గ‌డం లేద‌ని దిగులు చెందుతున్నారా ? ఇది రాస్తే 7 రోజుల్లో మీ గడ్డం గుబురుగా పెరగడం ఖాయం..!!

పురుషుల‌కు ఒక వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి గ‌డ్డం, మీసాలు బాగా పెరుగుతాయి. యుక్త వ‌య‌స్సులో గ‌డ్డం, మీసాల పెరుగుద‌ల ప్రారంభం అవుతుంది. 20 ఏళ్ల వ‌య‌స్సు దాటాక అవి బాగా పెరుగుతాయి. 30 ఏళ్లు వ‌చ్చే స‌రికి గడ్డం, మీసాలు మ‌రింత ద‌ట్టంగా పెరుగుతాయి. అంద‌రికీ కొంద‌రికి ఏళ్లు గడుస్తున్నా గ‌డ్డం, మీసాలు బాగా పెర‌గ‌వు. దీంతో గ‌డ్డం, మీసాలు బాగా పెర‌గ‌లేద‌ని వారు విచారిస్తుంటారు. గ‌డ్డం, మీసాలు పెర‌గ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి.

గ‌డ్డం, మీసాలు పెర‌గ‌డం లేద‌ని దిగులు చెందుతున్నారా ? ఇది రాస్తే 7 రోజుల్లో మీ గడ్డం గుబురుగా పెరగడం ఖాయం..!!

అయితే గ‌డ్డం, మీసాలు పెర‌గ‌ని వారు చింతించాల్సిన ప‌నిలేదు. కింద తెలిపిన అద్భుత‌మైన చిట్కాను పాటిస్తే ఆయా భాగాల్లో వెంట్రుక‌లు ద‌ట్టంగా పెరుగుతాయి. దీంతో చ‌క్క‌ని ఆకృతిలో ముఖం క‌నిపిస్తుంది. మరి ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ట‌మాటా ఒక‌టి తీసుకుని పైన తొక్క తీసి దాన్ని జ్యూస్‌లా చేయాలి. అందులో అర టీస్పూన్ క‌ల‌బంద గుజ్జు, ఒక టీస్పూన్ ఆముదం, అర టీస్పూన్ న‌ల్ల జీల‌క‌ర్ర పొడిని క‌లపాలి. అన్నింటినీ బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి.

పైన తెలిపిన విధంగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రాత్రి పూట గ‌డ్డం, మీసాల భాగంలో బాగా మ‌ర్ద‌నా చేయాలి. 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేశాక అలాగే వ‌దిలేయాలి. రాత్రి పూట ఈ విధంగా చేసి మిశ్ర‌మాన్ని అలాగే వ‌దిలేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డ‌గాలి.

ఇలా క‌నీసం వారం రోజుల పాటు చేస్తే త‌ప్ప‌క వెంట్రుక‌లు పెరుగుతాయి. కొంద‌రికి కొన్ని రోజులు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు ట్రై చేయాలి. దీని వ‌ల్ల గ‌డ్డం, మీసాలు బాగా పెరుగుతాయి.

ట‌మాటాల్లో ఉండే విట‌మిన్ సి, క‌ల‌బంద గుజ్జు, ఆముదం, న‌ల్ల జీల‌క‌ర్ర‌ల‌లో ఉండే విటమిన్ ఇ లు శిరోజాల‌ను పెరిగేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. అందువ‌ల్ల పైన తెలిపిన మిశ్ర‌మాన్ని ఉప‌యోగిస్తే గడ్డం, మీసాలు బాగా పెరుగుతాయి.

Share
Admin

Recent Posts