Beauty Tip : దీన్ని ముఖానికి రాస్తే చాలు.. చెప్ప‌లేనంత‌గా మారిపోతారు..!

Beauty Tip : ఒక చిన్న చిట్కాను వాడి మ‌నం మ‌న ముఖాన్ని చాలా సుల‌భంగా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఎండ‌లో తిర‌గ‌డం, ట్యాన్ పేరుకుపోవ‌డం, చ‌ర్మం పై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, దుమ్ము, ధూళి వంటి వాటి వ‌ల్ల అందంగా ఉన్న ముఖం కూడా న‌ల్ల‌గా నిర్జీవంగా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే జిడ్డు కార‌ణంగా మొటిమ‌లు, చ‌ర్మ రంధ్రాలు మూసుకుపోవ‌డం వంటి స‌మ‌స్య కూడా తలెత్తుతుంది. ఎండ వ‌ల్ల ముఖం న‌ల్ల‌గా మారిన వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన ముఖాన్ని తిరిగి అందంగా కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

ముఖాన్ని అందంగా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మనం నిమ్మ‌కాయ‌ను, ప‌సుపును, రోజ్ వాట‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మన ముఖానికి స‌రిప‌డా ప‌సుపును తీసుకోవాలి. త‌రువాత ఇందులో త‌గినంత రోజ్ వాట‌ర్ ను వేసి పేస్ట్ లాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు అర చెక్క నిమ్మ‌కాయ‌ను తీసుకుని ప‌సుపు మిశ్ర‌మంలో ముంచి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకునేట‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో నిమ్మ‌కాయ‌ను పిండుతూ ఉండాలి. ఈ విధంగా ఈ మిశ్ర‌మాన్ని రాసుకున్న త‌రువాత దీనిని పూర్తిగా ఆర‌నివ్వాలి.

Beauty Tip follow this remedy for wonderful results
Beauty Tip

త‌రువాత స‌బ్బు ఉప‌యోగించ‌కుండా సాధార‌ణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను సాయంత్రం పూట లేదా రాత్రి ప‌డుకునే ముందు పాటించి ఉద‌యాన్నే స‌బ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి లేదా నీటితో శుభ్రం చేసుకున్న‌ రెండు గంట‌ల త‌రువాత స‌బ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు, దుమ్ము, ధూళి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి మొటిమ‌లు కూడా రాకుండా ఉంటాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మ రంధ్రాలు శుభ్ర‌ప‌డతాయి. చ‌ర్మం లోతుగా శుభ్ర‌ప‌డి ముఖంపై ఉండే న‌లుపు, ట్యాన్ వంటివి తొల‌గిపోతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది.

D

Recent Posts