Beauty Tips : చర్మంపై ఐస్ క్యూబ్ లతో మసాజ్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే !

Beauty Tips : సాధారణంగా చాలా మంది తమ చర్మంపై ఉండే దుమ్ము, ధూళిని తొలగించి తమ ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఐస్ క్యూబ్స్ ను తీసుకుని వాటిని చర్మంపై మసాజ్ చేస్తుంటారు. అయితే ఇలా ఐస్ క్యూబ్స్ తో చర్మంపై మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Beauty Tips do like this with ice cubes for facial glow and beautifulness

1. మన చర్మంపై ఐస్ క్యూబ్ తో బాగా మసాజ్ చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు మొత్తం పోయి ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత ఇలా చేయటం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

2. చాలామంది మొటిమల సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే మొటిమలు కూడా ఎంతో నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని ఐస్ ముక్కలను ఒక శుభ్రమైన క్లాత్ లో వేసుకొని నొప్పి ఉన్నచోట పెడుతూ మసాజ్‌ చేసినట్లు చేయాలి. దీంతో వెంటనే నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు.

3. ఐస్ ముక్కలతో బాగా ఫేస్ మసాజ్ చేయడం వల్ల చర్మంలో పేరుకుపోయే దుమ్ము, ధూళి కణాలు, మృత కణాలు తొలగిపోతాయి. దీంతో ముఖానికి ఫ్రెష్‌ లుక్‌ వస్తుంది. తాజాగా ఉంటుంది. కాంతివంతంగా మారి చర్మం మెరుస్తుంది.

4. ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత చాలా మందికి కళ్ళు ఎంతో మంటగా ఉబ్బినట్టు అనిపిస్తాయి. అలాంటి సమయంలో ఐస్ క్యూబ్ లతో మర్దనా చేయడం వల్ల త్వరగా ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ విధంగా ఐస్‌ క్యూబ్‌లను ఉపయోగిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. చర్మ సమస్యలు పోతాయి.

Share
Sailaja N

Recent Posts