Weight Loss Tips : వాముతో అధిక బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసా ?

Weight Loss Tips : దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ వాము ఉంటుంది. ఇది వంట ఇంటి సామగ్రిలో ఒకటి. వీటిని రోజూ అనేక రకాల వంటలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాము వేసి పరాటాలను తయారు చేస్తారు. కూరల్లోనూ వామును వేస్తుంటారు. దీంతో చక్కని రుచి వస్తాయి. అయితే ఇది బరువును తగ్గించేందుకు కూడా సహాయ పడుతుంది. అలాగే పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా వాము అందిస్తుంది.

Weight Loss Tips lose your weight with carom seeds in these ways

వామును మనం నేరుగా తినవచ్చు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాములో థైమోల్ అనే ముఖ్యమైన నూనె ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నూనె జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ రసాలను స్రవించడంలో సహాయపడుతుంది. దీంతో శరీర జీవక్రియ రేటు (మెటబాలిజం) కూడా మెరుగు పడుతుంది. ఈ క్రమంలో అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది. మెటబాలిజం పెరిగితే క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గుతారు.

ఇక వాము గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో కూడా బరువును తగ్గించుకోవచ్చు. ఈ నీళ్లలో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో అనేక విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో ఒక టీస్పూన్‌ వాము గింజలను వేసి నానబెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి అందులో ఒక టీస్పూన్‌ తేనె కలపాలి. మీరు దీన్ని ప్రతిరోజూ తినవచ్చు. ఇది త్వరగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.

లేదా.. నీటిలో వాము గింజలను వేసి మరిగించి కూడా ఆ నీటిని తాగవచ్చు. తోడుగా తేనె చేర్చుకుంటే ఇంకా ఫలితం ఉంటుంది. ఇక వాము గింజలను పెనంపై వేసి కొద్దిగా వేయించి పొడి చేసి ఆ పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని భోజనం చేసే సమయంలో మొదటి ముద్దలో ఒక టీస్పూన్‌ మోతాదులో పెట్టి తినాలి. ఇలా చేసినా బరువును తగ్గించుకోవచ్చు.

ఇక వాము గింజలు, సోంపు గింజలను అర టీస్పూన్‌ చొప్పున తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీని వల్ల కూడా బరువు తగ్గుతారు.

Admin

Recent Posts