Besan Flour For Beauty : ముఖం అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన వంటింట్లో ఉండే పదార్థాలతో చక్కటి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని తినడం వల్ల మనం చాలా సులభంగా మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను వాడడానికి గానూ మనం ముఖ్యంగా శనగపిండిని ఉపయోగించాల్సి ఉంటుంది. శనగపిండి సౌందర్య సాధనంగా చక్కగా పని చేస్తుంది. దీనిని వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపు తొలగిపోతుంది. అలాగే ముడతలు తగ్గి చర్మం బిగుతుగా తయారవుతుంది.
చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి వంటివి వాటిని తొలగించడంలో శనగపిండి మనకు ఎంతో దోహదపడుతుంది. శనగపిండిని ఎలా వాడడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పెరుగును వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. చివరగా ఇందులో విటమిన్ ఇ క్యాప్సుల్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత సబ్బును ఉపయోగించడకుండా కేవలం నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
అలాగే ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు కూడా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారినికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే సున్నితమైన మరియు పొడి చర్మం ఉన్న వారు నిమ్మకాయను ఉపయోగించకపోవడమే మంచిది. ఈ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపు, మృతకణాలు తొలగిపోతాయి. చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా అలాగే బయటకు వెళ్లే పని లేకుండా మన ఇంట్లోనే మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.