Fairness With Turmeric : దీన్ని రాస్తే చాలు.. మీరు చూస్తుండ‌గానే తెల్ల‌గా మారిపోతారు..!

Fairness With Turmeric : వాతావ‌ర‌ణ కాలుష్యం, మృత‌క‌ణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి చ‌ర్మం పై పేరుకుపోవ‌డం వ‌ల్ల చ‌ర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో మ‌చ్చ‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌చ్చ‌లు, మొటిమ‌లు వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా త‌యార‌వుతుంది. మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, అలాగే మొటిమ‌ల వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు, గుంత‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉండాలంటే మ‌నం ఎల్ల‌ప్పుడూ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖంపై జిడ్డు పేరుకుపోకుండా చూసుకోవాలి. చాలా మంది ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డానికి స్క్ర‌బ‌ర్ ల‌ను, ఫేస్ వాష్ ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డును, మురికిని, మృత‌క‌ణాల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

ముఖంపై ఉండే జిడ్డును, మ‌చ్చ‌ల‌ను తొల‌గించి ముఖాన్ని అందంగా మార్చే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మీగ‌డ లేని పుల్ల‌టి పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో చిటికెడు ప‌సుపును వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి.

Fairness With Turmeric mix these and apply it for effective results
Fairness With Turmeric

ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. చ‌ర్మంపై పేరుకుపోయిన మృత‌కణాలు, మురికి, దుమ్ము అంతా తొల‌గిపోయి చ‌ర్మం అందంగా త‌యార‌వుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మొటిమలు, మ‌చ్చ‌లు కూడా త‌గ్గుతాయి. అలాగే ఈ ప్యాక్ ను వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ముఖం ఉండే మొటిమలు, మ‌చ్చ‌లు తొల‌గిపోవ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటాయి.

D

Recent Posts