Beauty Tips : మనలో చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి మోకాళ్లు, మెడ, మోచేతులు, చంకలు, గజ్జలు వంటి ప్రాంతాల్లో నల్లగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, ఎండ, దుమ్ము, చెమట పట్టడం ఇలా కారణాలేవైనప్పటికీ శరీరంలో కొన్ని కొన్ని భాగాలు నల్లగా అవుతాయి. తరచూ షేవ్ చేయడం వల్ల ఆల్కహాల్ కలిగిన డియోడ్రెంట్ లను వాడడం వల్ల చంకలు నల్లబడతాయి. ఎన్ని రకాల క్రీములును రాసినప్పటికీ ఆయా భాగాల్లో చర్మం తెల్లబడదు. ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం మెడ, మోచేతులు, చంకలు వంటి భాగాలను తెల్లగా మార్చుకోవచ్చు.
ఎండ కారణంగా నల్లబడ్డ చర్మానికి తిరిగి పూర్వస్థితిని ఇవ్వడంలో కలబంద గుజ్జు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును తగిన మోతాదులో తీసుకుని నల్లగా మారిన చర్మంపై బాగా రుద్దాలి. అర గంట తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. అదే విధంగా మనం వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాను వాడి కూడా మనం నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకుని దానికి కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు నల్లబడిన చర్మ భాగాలపై రాసి అర గంట తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మెడ, మోచేతులు, గజ్జలు వంటి భాగాల్లో చర్మం తెల్లగా మారుతుంది. నల్లబడిన చర్మాన్ని తెల్లగా మార్చడంలో నిమ్మకాయ కూడా మనకు దోహదపడుతుంది. చర్మానికి మెరుపును, ప్రకాశాన్ని ఇచ్చే గుణాలు నిమ్మకాయలో అధికంగా ఉన్నాయి. నిమ్మ రసాన్ని లేదా నిమ్మ చెక్కను నల్లగా మారిన చర్మంపై రాయాలి. అర గంట పాటు ఇలాగే ఉంచి తరువాత నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మం పూర్వ స్థితిని సంతరించుకుంటుంది.
చర్మంపై ఉండే నలుపుదనాన్ని తొలగించడంలో ఆలివ్ నూనె మనకు సహాయపడుతుంది. ఆలివ్ నూనెను, చక్కెరను సమానంగా తీసుకుని పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను నల్లగా మారిన చర్మ భాగాలల్లో చర్మంపై రాయాలి. ఇలా రాసిన పది నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మం తెల్లగా మారుతుంది. అలాగే కీరదోసను ఉపయోగించడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. కీరదోసను గుజ్జుగా చేసి అందులో నిమ్మసం, పసుపు కలిపి చర్మం నల్లగా ఉన్న భాగాల్లో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు.
మన చర్మాన్ని సంరక్షించడంలో పాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పాలు, పెరుగును కలిపి మెడ, చంక, మోకాళ్లు వంటి భాగాల్లో రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా పొడి చర్మం ఉన్న వారికి చక్కగా పని చేస్తుంది. నల్లబడిన చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఆలుగడ్డ కూడా మనకు సహాయపడుతుంది. ఒక జార్ లో ఆలుగడ్డ ముక్కలను వేసి మెత్తని గుజ్జుగా చేయాలి. తరువాత ఈ గుజ్జు నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని నల్ల బడిన చర్మంపై రాసి అర గంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుంది.
పైన తెలిపిన ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఆయా భాగాల్లో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.