మ‌హిళ‌లు ముఖంపై ఉండే అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకునేందుకు అద్భుత‌మైన చిట్కాలు..!

మ‌న శ‌రీరంపై అనేక భాగాల్లో వెంట్రుక‌లు పెరుగుతుంటాయి. అయితే మ‌హిళ‌ల‌కు కొంద‌రికి ముఖంపై కూడా వెంట్రుక‌లు వ‌స్తుంటాయి. దీంతో తీవ్ర అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో ముఖంపై ఏర్ప‌డే అవాంఛిత రోమాల‌ను తొలగించుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

మ‌హిళ‌లు ముఖంపై ఉండే అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకునేందుకు అద్భుత‌మైన చిట్కాలు..!

* రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నిమ్మ‌ర‌సం, చ‌క్కెర తీసుకుని వాటిని 8-9 టేబుల్ స్పూన్ల నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం వేడి చేయాలి. మిశ్ర‌మం నుంచి బుడ‌గ‌లు వ‌చ్చే వ‌ర‌కు వేడి చేశాక స్ట‌వ్ ఆర్పి ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్ల‌బ‌ర‌చాలి. అనంత‌రం దాన్ని ఒక చిన్న గ‌రిటె స‌హాయంతో ముఖంపై వెంట్రుక‌లు ఉండే చోట రాయాలి. 20-25 నిమిషాల పాటు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. గ‌రిటె స‌హాయంతో ముఖంపై ఆ మిశ్ర‌మాన్ని రాసేట‌ప్పుడు వృత్తాకారంలో తిప్పుతూ రాయాలి. దీంతో ఆ మిశ్ర‌మం బాగా ప‌నిచేస్తుంది. ఇలా త‌ర‌చూ చేస్తుంటే అవాంఛిత రోమాలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

* రెండు టేబుల్ స్పూన్ల చ‌క్కెర‌, అంతే మోతాదులో నిమ్మ‌ర‌సం, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని అన్నింటినీ బాగ క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని 3 నిమిషాల పాటు వేడి చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్లార్చి ముఖంపై ముందుగా కార్న్ స్టార్చ్ రాయాలి. దానిపై ఆ మిశ్ర‌మాన్ని అప్లై చేయాలి. అనంత‌రం వాక్సింగ్ స్ట్రిప్ లేదా కాట‌న్ క్లాత్‌తో శుభ్రం చేయాలి. దీంతో వెంట్రుక‌లు పోతాయి.

* రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్‌, బాగా పండిన అర‌టి పండుల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దాన్ని వెంట్రుక‌లు ఉండే చోట రాయాలి. 15 నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి. త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. దీని వ‌ల్ల కూడా అవాంఛిత రోమాలు రాలిపోతాయి.

* ఒక టేబుల్ స్పూన్ తేనె, నిమ్మ‌ర‌సం, 5 టేబుల్ స్పూన్ల ఆలుగ‌డ్డ జ్యూస్ తీసుకుని అన్నింటినీ బాగా క‌ల‌పాలి. త‌రువాత అందులో నాన‌బెట్టిన పెస‌ల పేస్ట్‌ను క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై రాసి 20 నిమిషాలు ఆగి క‌డిగేయాలి. దీంతో ఫ‌లితం ఉంటుంది.

* ఒక టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్‌, అంతే మోతాదులో చ‌క్కెర‌, ఒక కోడిగుడ్డు తెల్ల సొన ల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖంపై రాయాలి. పొడిగా అయ్యాక తీసేసి క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే అవాంఛిత రోమాలు ప‌డిపోతాయి.

Admin

Recent Posts