Masala Omelette Rolls Curry : మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ.. ఒక్క‌సారి చేసి తినండి.. మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Masala Omelette Rolls Curry : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటాయి. ఆమ్లెట్ త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఆమ్లెట్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం కూర‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. ఆమ్లెట్ తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక‌సారి తింటే మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన చిన్న ట‌మాట – 1, చిన్న‌గా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన కొత్తిమీర – ఒక టీ స్పూన్, కోడిగుడ్లు – 4, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్.

Masala Omelette Rolls Curry recipe in telugu make in this way
Masala Omelette Rolls Curry

క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ట‌మాటాలు – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత నెనం మీద నూనె వేసి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. త‌రువాత ఈ ఆమ్లెట్ ను కాల్చుకోవాలి. ఆమ్లెట్ ఒక వైపు కాలిన త‌రువాత దానిని రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలా రోల్స్ ను త‌యారు చేసుకున్న త‌రువాత వాటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌కర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, కారం వేసి క‌లపాలి. మ‌సాలాలు చ‌క్క‌గా వేగిన త‌రువాత నీళ్లు, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట పేస్ట్, క‌రివేపాకును వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత 250 ఎమ్ ఎల్ నీళ్లు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆమ్లెట్ రోల్స్ ను తీసుకోవాలి. త‌రువాత వీటిపై కూర‌ను వేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts