Multani Mitti Honey Face Pack : ముల్తానీ మ‌ట్టి, తేనెల‌ను క‌లిపి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి.. ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!

Multani Mitti Honey Face Pack : ముఖం అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ఖ‌రీదైన సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల అందంగా క‌నిపించిన‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ముఖాన్ని అందంగా మార్చ‌డంలో ముల్తానీ మ‌ట్టి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఎంతో కాలంగా ముల్తానీ మ‌ట్టిని సౌంద‌ర్య సాధ‌నంగా ఉప‌యోగిస్తున్నారు. ఆయుర్వేదంలో అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు.

ముల్తానీ మ‌ట్టిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ముల్తానీ మ‌ట్టితో ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక‌టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో రెండు టీ స్పూన్ల‌ రోజ్ వాట‌ర్ ను, ఒక టీ స్పూన్ తేనెను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత దీనిని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. దీనిని పూర్తిగా ఆరిన త‌రువాత సాధార‌ణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Multani Mitti Honey Face Pack do it yourself in this way
Multani Mitti Honey Face Pack

ఇలా చేయడం వ‌ల్ల ముఖం శుభ్ర‌ప‌డుతుంది. ముఖంపై ఉండే మొటిమ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. వేస‌వి కాలంలో ఇలా ముల్తానీ మ‌ట్టితో పేస్ ప్యాక్ ను వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం చ‌ల్ల‌బ‌డుతుంది. ఎండ వ‌ల్ల చ‌ర్మం కందిపోకుండా, న‌ల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. ముల్తానీ మ‌ట్టిలో తేనె వేసుకుని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల కందిపోయిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి వ‌స్తుంది. ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది. చ‌ర్మం మృదువుగా అవుతుంది. ఈ విధంగా ముల్తానీ మ‌ట్టి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts