Rice Flour For Underarms : ఇలా చేస్తే ఎంత న‌ల్ల‌గా ఉన్న చంక‌లైనా స‌రే.. తెల్ల‌గా మారాల్సిందే..!

Rice Flour For Underarms : మ‌న‌లో చాలా మందికి చంక‌లో చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. చంక భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు న‌చ్చిన బ‌ట్ట‌లు వేసుకోలేక అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. చంక‌లో చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ర‌సాయ‌నాలు క‌లిగిన డియోడ్రెంట్ల‌ను వాడ‌డం, చంక భాగాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, ఆ భాగంలో మృత‌క‌ణాలు, మురికి పేరుకుపోవ‌డం వంటివి పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత ఆ భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది.

ఒక చ‌క్క‌టి చిట్కాను వాడి మ‌నం చాలా సుల‌భంగా చంక‌లో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. చంక భాగంలో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం 2 టీ స్పూన్ల బియ్యం పిండిని, అర టీ స్పూన్ కొబ్బ‌రి నూనెను, 2 టీ స్పూన్ల నిమ్మ‌ర‌సంను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొబ్బ‌రి నూనె, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని పేస్ట్ లాగా చేసుకున్న త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ తో తీసుకుని చంక భాగంలో నెమ్మ‌దిగా రుద్దుకోవాలి.

Rice Flour For Underarms whitening how to use it
Rice Flour For Underarms

ఇలా రుద్దుకున్న త‌రువాత ఆరే వ‌ర‌కు దీనిని అలాగే ఉంచాలి. ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చంక భాగంలో పేరుకుపోయిన న‌లుపు, మురికి తొల‌గిపోయి చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది. అంతేకాకుండా చ‌ర్మం మృదువుగా మారుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడు సార్లు వాడ‌డం వ‌ల్ల చంక భాగంలో చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది.

Share
D

Recent Posts