Sugar For Face Glow : అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందంగా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ముఖం తెల్లగా అందంగా కనబడడానికి మార్కెట్ లో లభించే అన్నీ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను, స్క్రబర్ లను కూడా వాడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఫలితం లేక చివరికి నిరుత్సాహ పడుతూ ఉంటారు. ఎన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడినా ఫలితం లేని వారు, ముఖం అందంగా, తెల్లగా కనిపించాలనుకునే వారు ముఖంపై నలుపును, మృతకణాలు, ట్యాన్ ను తొలగించుకోవాలనుకునే వారు ఈ చిన్న చిట్కాను వాడడం వల్ల ముఖం అందంగా, తెల్లగా మారుతుంది.
ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం. అలాగే వాడడం కూడా చాలా సులభం. ముఖంపై నలుపును తొలగించి ముఖాన్ని తెల్లగా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం రసాయనాలు లేని ఫేస్ వాష్ ను, పంచదారను, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల ఫేస్ వాష్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో 3 స్పూన్ల పంచదార, అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దనా చేయాలి. పావు గంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి.
ఎండ వల్ల చర్మంపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోయి చర్మం సాధారణ రంగుకు వస్తుంది. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చిట్కా తయారీలో వాడిన పంచదార స్క్రబర్ లాగా పని చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను, నలుపును తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో వాడిన కొబ్బరి నూనె చర్మానికి తగినంత తేమను అందించి చర్మం పొడి బారకుండా కాపాడడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల ఎండ వల్ల, కాలుష్యం వల్ల నల్లగా మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ముఖం అందంగా తయారవుతుంది.